Begin typing your search above and press return to search.

ఈ రేంజ్ లో వచ్చి చేతులు పట్టుకుంటేనా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:46 PM GMT
ఈ రేంజ్ లో వచ్చి చేతులు పట్టుకుంటేనా?
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్టైలే వేరు. వివాదాలతో కాపురం చేయడం ఈమెకు ఎంతిష్టమో అన్నట్లుగా ఉంటుంది వాలకం. ఫిలిం ఫేమస్ పర్సనాలిటీలపైనా.. ఇండస్ట్రీ వ్యవహారాలపైనా ఎలాంటి కామెంట్స్ అయినా సరే చేసేయగలదు. తనకు అనిపించిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది కూడా. ఇలాగే అదృష్టం.. అడ్డదారులు టైపులో ఇతర హీరోయిన్స్ పై కూడా కౌంటర్స్ వేసేసిన హిస్టరీ ఈమెకు ఉంది. అందుకే ఇతర హీరోయిన్స్ తో కంగనాకు అంతగా సత్సంబంధాలు ఉండవు.

రీసెంట్ గా హృతిక్ రోషన్ ఎపిసోడ్ తో కంగనా పేరు మార్మోగిపోయినా.. మరికొంతమంది ఈమెకు దూరం అయిపోయారని అంటారు. అలాగని ఆడియన్స్ లో ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు లెండి. అలాగే సెలబ్రిటీ సర్కిల్స్ లో పాపులారిటీకి కూడా డ్యామేజ్ జరగలేదు. రీసెంట్ గా జీక్యూ మేగజైన్ ఇచ్చే అవార్డ్స్ కి సంబంధించి ఓ సెలబ్రిటీ పార్టీ జరిగింది. దీనికి క్లీవేజ్ అంతా చూపించేస్తూ.. కంగనా హాజరైన తీరు చాలామందికి షాక్ కొట్టించేంది. అయితే.. క్వీన్ ఈ ఈవెంట్ లో రణవీర్ సింగ్ తో కలిసి క్వీన్ చాలాసేపు కబుర్లు చెప్పడం.. చేతిలో చేయి వేసి మాట్లాడ్డం అందరినీ అట్రాక్ట్ చేసింది.

ప్రొఫెషనల్ గా తప్ప పర్సనల్ విబేధాలు కూడా లేకపోయినా రణవీర్ సింగ్ గాళ్ ఫ్రెండ్ అయిన దీపికా పదుకొనేతో.. కంగనా రనౌత్ కి పెద్దగా సత్సంబంధాలు లేవు. కానీ రణవీర్ సింగ్ తో మాత్రం కాసింత క్లోజ్ గా మూవ్ అవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/