Begin typing your search above and press return to search.
కంగనా ఫిట్ నెస్ వీడియో....వైరల్!
By: Tupaki Desk | 1 July 2018 10:40 AM GMTబాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, విలక్షణ దర్శకుడు క్రిష్ ల కాంబోలో తెరకెక్కుతోన్న `మణి కర్ణిక` చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మోషన్ టీజర్ క మంచి రెస్పాన్స్ వచ్చింది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా కంగనా లుక్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే, ఆ సినిమాలో యుద్ధాలు, యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో కంగనా ఫిట్ నెస్ ను బాగా మెయింటెన్ చేస్తోంది. తాజాగా, ఫిట్ నెస్ కు సంబంధించిన యాడ్ లో కంగనా ఫిట్ నెస్ ను చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. అప్ అండ్ డౌన్ పుష్ అప్స్ చేస్తోన్న కంగనా....వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సినిమా కోసం కంగనా చాలా కష్టపడుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
``ప్రపంచమంతా తల క్రిందులుగా ఉంది.....మీరు మాత్రం నిటారుగా నిలబడండి``...అన్న ట్యాగ్ లైన్ ఉన్న ఆ యాడ్ లో కంగనా చేసిన పుష్ అప్స్ వైరల్ అయ్యాయి. అయితే, కేవలం యాడ్ లో మాత్రమే కాకుండా....జిమ్ లో కూడా ఫిట్ నెస్ కోసం శ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో వస్తోన్న `మణి కర్ణిక`లో యాక్షన్ పార్ట్ - కత్తి యుద్ధాల కోసం కంగనా ఫిట్ నెస్ ను కాపాడుకుంటోంది. ఆ చిత్ర సెట్స్ నుంచి లీక్ అయిన పిక్స్ ...వైరల్ అయ్యాయి. క్రిష్ తెరకెక్కించిన ఆ హిస్టారికల్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మరి కొన్ని పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందని టాక్.