Begin typing your search above and press return to search.
'ఇండస్ట్రీలో 99 శాతం మంది డ్రగ్స్ లో మునిగితేలుతున్నారు'
By: Tupaki Desk | 29 Aug 2020 5:00 PM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వచ్చి చేరింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్సప్ చాటింగ్ ద్వారా నిషేధిత డ్రగ్స్ కొనుగోలు చేసిందని.. అయితే దానికి సంబంధించిన మెసేజ్ లను డిలీట్ చేసిందని.. అయితే ఈడీ అధికారులు ఆ డిలేటెడ్ మెసేజ్ లు తిరిగి పొందారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంతో సుశాంత్ ప్రియురాలు రియాకు సంబంధం ఉందంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీనిపై స్పందించింది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని చీకటి కోణాలని ప్రశ్నిస్తూ వస్తున్న కంగనా.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసింది.
కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే తీసుకుంటారని కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మాదకద్రవ్యాలను వినియోగించారని.. పార్టీ ఉంటే ప్రతి ఒక్కరూ అందులో మునిగితేలుతారని ఆరోపించారు. మన యూత్ మొత్తం డ్రగ్స్ కి బానిస అవుతున్నారని.. సినీ ఇండస్ట్రీ దీనికి వారిని రోల్ మోడల్స్ చేసినందున బాధ్యత వహించాలని పేర్కొంది. ఇంతకముందు కూడా కంగనా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం గురించి ట్వీట్ చేసింది. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ కు సహకారం అందిస్తానని.. మొత్తం గుట్టు బయటపెడతానని చెప్పింది. సుశాంత్ కు ఇండస్ట్రీ 'డర్టీ సీక్రెట్స్' తెలుసు కాబట్టే అతను చనిపోవాల్సి వచ్చిందని.. బాలీవుడ్ లో డ్రగ్స్ ఉపయోగించడం కొన్ని హౌజ్ పార్టీల్లో ఈ డ్రగ్స్ వాడకం సర్వసాధారణంగా మారిందని.. వాళ్ళు ఎక్కువగా వాడేది మాత్రం చాలా ఖరీదైనా కొకైనే అంటూ ట్వీట్ చేసింది కంగనా.