Begin typing your search above and press return to search.

మళ్ళీ ఒంటికాలిపై లేచిన కంగనా!

By:  Tupaki Desk   |   5 Feb 2019 5:12 PM GMT
మళ్ళీ ఒంటికాలిపై లేచిన కంగనా!
X
మణికర్ణిక' సినిమాకు సంబంధించి క్రిష్ వివాదం అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో కొందరు క్రిష్ కు మద్దతిస్తుంటే.. మరికొందరు కంగనాను సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అని చెప్పమంటే మాత్రం ఎవ్వరూ చెప్పలేని విధంగా ఈ వివాదం జటిలమైంది.

క్రిష్ ఎంత సమర్ధించుకోవాలని చూసినా సినిమా రిలీజ్ కాకముందే బయటకు వచ్చేశాడన్నది వాస్తవం. మరోవైపు సినిమా రిలీజ్ వరకూ కామ్ గా ఉండి సినిమా రిలీజ్ అయిన తర్వాత తనావైపు వాదన వినిపిస్తూ కంగనా రనౌత్ చేసింది తప్పు అని ఎలుగెత్తి చాటడం ద్వారా క్రిష్ ఏం సాధించాలనుకున్నాడో తెలియదు గానీ క్రిష్ ఇమేజ్ కొంతవరకూ మసకబారిందన్నది కూడా వాస్తవమే. రిలీజ్ సమయంలో కంగనాపై ఎటాక్ చేయడం కరెక్ట్ కాదని క్రిష్ మద్దతుదారులు కూడా కొందరు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో సారి క్రిష్ ను ఏకిపారేసింది. "నేను అంతా ఒపెన్ గా మాట్లాడతాను. మేము డిసెంబర్ లోనే క్రిష్ ను సినిమా చూడమని కోరాం. కానీ అయన చూడలేదు. నిజానికి అయన ఈ సినిమా స్మాష్ అయిపోయిందని.. ఎవరు కూడా మళ్ళీ దానిని పట్టాలెక్కించలేరని అనుకున్నాడు. కానీ ఆ పని నేను చేసేసరికి 'నా సినిమా.. నా సినిమా' అంటూ గొడవ మొదలు పెట్టాడు. అది సరే. ఆయనకు క్రెడిట్ ఉంది. కానీ మీడియాలో మమల్ని దోషులుగా చిత్రీకరించడం ఎందుకు? నన్నే కలిసి అయన ఇబ్బందులు చెప్పొచ్చు కదా? అయన నన్నెప్పుడు కలవలేదు. అయన ఇబ్బందులు నాతో చర్చించలేదు. మీకు నిజంగా ఈ సినిమాపై నాకు.. అంకిత.. ప్రసూన్ .. శంకర్ లకు ఉన్నట్టే గౌరవం ఉంటే సినిమాకు ఎంతో ముఖ్యమైన మొదటివారంలో మాపై మీడియా ద్వారా దాడి చేస్తారా? సినిమాను దెబ్బతీయడానికి కాకపోతే.. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?" అంటూ చెలరేగిపోయింది.

ఆమె చెప్పేవాటిలో కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయని ఆమె చెప్పేదంతా కరెక్ట్ అని.. చేసేదంతా కరెక్ట్ అని కాదు. ఆమె ఎంత శాతం సినిమా డైరెక్ట్ చేసిందనేది అందరికీ అర్థం అవుతూ ఉన్నా క్రెడిట్ తీసుకోవాలని అనుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. మూడు నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ లో మాట్లాడుతూ "నేను ఇప్పుడు స్టార్ ను కాబట్టి ఫైనల్ డెసిషన్ నాదే. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీరు ఊరికే ఏడవకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి.. నాపైన పడి ఏడిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. వీలైతే నేను కట్ చేశానని చెప్తున్న కండల వీరుడు పాత్ర (సోను సూద్).. మిగతా గ్యాంగు ను పెట్టి సినిమా తీసుకొని హిట్ చేసుకోండి" అని డైరెక్ట్ ఎటాక్ చేసింది. క్రిష్ టాలెంట్ అందరికీ తెలిసిందే. అలాంటిది క్రిష్ ను ఇలా ఎగతాళిగా మాట్లాడడం సరైన పధ్ధతని ఎలా చెప్పాలి? ఏదేమైనా ఈ గొడవ మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.