Begin typing your search above and press return to search.
హిట్ సరే.. పారితోషికం బాంబ్ పేల్చారు
By: Tupaki Desk | 25 May 2015 3:30 PM GMTసక్సెస్ ఇచ్చే కిక్కే వేరు. అందునా వరుసగా విజయాలు వెంటబడి వస్తే అది ఇంకా కిక్కిస్తుంది. ప్రస్తుతం అలాంటి కిక్కునే ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ భామలు కంగన రనౌత్, దీపికపదుకొన్. కంగన నటించిన తను వెడ్స్ మను రిటర్న్స్, దీపిక నటించిన పికూ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇవి రెండూ నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలే. నటనకు, ప్రతిభను చూపించడానికి ఆస్కారం ఉన్న సినిమాలే కావడంతో ఈ ఇద్దరి పేర్లు బాలీవుడ్లో మార్మోగిపోతున్నాయి.
ఓ వైపు విమర్శకుల ప్రశంసల జల్లుల్లో తడిసి ముద్దవుతూనే పారితోషికం పెంచే పనిలో పడ్డారు అమ్మణ్ణులు. ఇప్పుడున్న పారితోషికానికి డబుల్ వసూలు చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. పెద్ద బ్యానరా? చిన్న బ్యానరా? అన్నది అనవసరం. ఎవరైనా ఫర్వాలేదు. అయితే కథ నచ్చాలి. పాత్రలో నటించడానికి స్కోప్ ఉండాలి. హిట్ కొట్టే గ్యారెంటీ కావాలి.. అని చెబుతున్నారు ఈ ఇద్దరూ. ఇంతకాలం కేవలం హీరోలకే ఇలాంటి స్కోపుండేది. ఈ భామలిద్దరూ ఆ ట్రాక్‌ను మార్చేశారు. అదృష్టం, అవకాశం రెండూ తమ వెంటపడేలా చేసుకుంటున్నారు. అందుకే అడిగినంతా ఇచ్చుకోవాల్సిందే. నిర్మాతలకు ఈ విషయంలో నో ఆప్షన్.