Begin typing your search above and press return to search.
కంగన నోట 'యన్.టి.ఆర్' మాట
By: Tupaki Desk | 27 Aug 2018 8:08 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ హిందీలో టాప్ స్టార్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడాది ప్రథమార్ధంలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీని రిలీజ్ సంగతి ఎటూ తేలకపోవడం.. క్రిష్ ఆ సినిమాను పక్కన పెట్టి ‘యన్.టి.ఆర్’ మొదలుపెట్టేయడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. క్రిష్ ని తీరు పట్ల కంగనా.. నిర్మాతలు సంతృప్తిగా లేరని.. అతడి ప్రమేయం లేకుండా మార్పులు చేర్పులు చేస్తున్నారని.. రీషూట్లు జరుగుతున్నాయని బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు నడిచాయి. ఈ విషయమై క్రిష్ మౌనం పాటిస్తుండగా.. కంగనా స్పందించింది. క్రిష్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ‘మణికర్ణిక’ విషయంలో తామిద్దరం తరచుగా మాట్లాడుకుంటున్నామని ఆమె చెప్పింది.
సీజీ వర్క్ ఆలస్యం కావడం వల్లే ‘మణికర్ణిక’ విడుదల ఆలస్యమవుతోందని కంగనా చెప్పింది. ఈ సందర్భంగా ఆమె క్రిష్ తెలుగులో తీస్తున్న ‘యన్.టి.ఆర్’ ప్రస్తావన తేవడం విశేషం. ‘మణికర్ణిక’ రిలీజ్ జనవరి నెలాఖర్లో అనుకున్నామని.. కానీ అదే నెలలో క్రిష్ తెలుగు సినిమా కూడా విడుదల కావాల్సి ఉందని.. దాని కోసం డేట్లు కేటాయించడంతో క్రిష్ ‘మణికర్ణిక’కు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని ఆమె చెప్పింది. రిపబ్లిక్ డే కాదనుకుంటే తమ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని కంగన చెప్పింది. ‘మణికర్ణిక’ ఔట్ పుట్ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదని.. సినిమా చాలా బాగా వచ్చిందని కంగన స్పష్టం చేసింది. కంగనా ప్రస్తుతం మరో టాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ అనే సినిమాలో నటిస్తుండటం విశేషం.