Begin typing your search above and press return to search.

ఈ పారితోషకం చూస్తే కళ్లు చెదురుతాయ్‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 7:30 AM GMT
ఈ పారితోషకం చూస్తే కళ్లు చెదురుతాయ్‌
X
బాలీవుడ్ లో హీరోయిన్‌ గా ఎద‌గ‌డం అంటే ఆషామాషీ కాదు. ఓసారి స్టార్ డ‌మ్ వ‌చ్చాక రేంజు కూడా అలానే ఉంటుంది మ‌రి. పారితోషికంలో, గుర్తింపులో ఉత్త‌రాది క‌థానాయిక‌ల హ‌వానే వేరు. అందుకే సౌత్ నుంచి ముద్దుగుమ్మ‌లంతా ముంబై ప‌రిశ్ర‌మ‌కు వెళ్లి అక్క‌డ ఏలేయాల‌ని క‌ల‌లు గంటుంటారు. అయితే ఇప్పుడున్న బాలీవుడ్ హీరోయిన్ల‌తో పోటీప‌డ‌డం అంత వీజీ కాదు. అక్క‌డ భామ‌ల్లో టాప్ రెమ్యున‌రేష‌న్ అందుకునే నాయిక ఎవ‌రు? టాప్ 5లో ఉన్న భామ‌లెంద‌రు? ఆరాతీస్తే తెలిసిన సంగ‌తులివి..

స్టార్ హీరోయిన్‌ లు దిమ్మ తిరిగే పారితోషికాలు తీసుకుంటూ అందుకు త‌గ్గ‌ట్టే నిర్మాత‌ల‌కు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న భామ‌గా కంగ‌న ర‌నౌత్ పేరు మార్మోగిపోతోంది. ‘తను వెడ్స్ మను’ - ‘క్వీన్’ - ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రాలతో అసాధార‌ణంగా స్టాట‌స్ పెంచుకుంది ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం రూ.11 కోట్లు అందుకుంటోంది. ఉత్త‌రాదిన టాప్ -1 హీరోయిన్ త‌నే. ఇక న‌వ‌త‌రం నాయిక‌ల‌తో పోటీప‌డుతూ.. కరీనా రూ.9 కోట్ల రూపాయలు అందుకుంటోంది. ప్రియాంకా చోప్రా - దీపికా పదుకొనే 9 కోట్లకు అటూ ఇటూగా అందుకుంటూ మూడో స్థానంలో ఉన్నారు.

ఇకపోతే విద్యాబాలన్ - క‌త్రిన నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్ద‌రూ 7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అనుష్కా శర్మ - సోనమ్ కపూర్ 6 కోట్లు పారితోషికంతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. యంగ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ 5 కోట్ల పారితోషికంతో ఆరో స్థానంలో ఉంది. ఆలియా భట్ - పరిణీతి చోప్రా 3 కోట్లు అందుకుంటూ టాప్‌ స్లాట్‌ లోకి దూసుకొచ్చే న‌వ‌త‌రం నాయిక‌లుగా పేరు తెచ్చుకున్నారు. అదీ మ్యాట‌రు.