Begin typing your search above and press return to search.

శత్రువు తప్పుకుంటే ఎంత ఆనందమో!

By:  Tupaki Desk   |   2 Dec 2018 8:04 AM GMT
శత్రువు తప్పుకుంటే ఎంత ఆనందమో!
X
సినిమాల విడుదల విషయంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించేది పోటీ. కంటెంట్ ఎంత ఉన్నా ఓపెనింగ్స్ షేర్ చేసుకోవడంతో పాటు అపోజిషన్ కు టాక్ ఏ మాత్రం బాగా వచ్చినా మనది తేడా కొట్టేస్తుంది. అందుకే కంగనా రౌనత్ తన మణికర్ణిక విషయంలో అనుకోకుండా జరిగిన పరిణామానికి పైకి మరీ గట్టిగా చెప్పుకోకపోయినా లోలోపల మాత్రం తెగసంబరపడిపోతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో మొదలై చివరికి కంగనా పర్యవేక్షణలో పూర్తైన మణికర్ణిక జనవరి 25 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హిందితో పాటు తెలుగు తమిళ వెర్షన్లు డబ్బింగ్ రూపంలో రెడీ అవుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని టీం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.

నిజానికి మణికర్ణికతో పాటు హృతిక్ రోషన్ సూపర్ 30 కూడా అదే డేట్ కు ఇంతకు ముందే ఫిక్స్ చేసారు. కాని మీ టూ రచ్చ స్టార్ట్ అయ్యాక దర్శకుడు వికాస్ బహ్ల్ తప్పుకోవడంతో బాలన్స్ వర్క్ లేట్ అయిపోయి జనవరిలో రావడం అసాధ్యం అనేదాకా వచ్చింది పరిస్థితి. ఇది ఇప్పుడు మణికర్ణికకు అతి పెద్ద ప్లస్ గా మారబోతోంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కంగనా హృతిక్ లు బద్ధశత్రువులు. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుని వ్యవహరం మీడియా దాకా వెళ్ళేలా రచ్చ చేసుకున్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా నివురు గప్పిన నిప్పులా ఇది అవసరమైనప్పుడు బయటపడుతూనే ఉంటుంది.

సూపర్ 30 ఇప్పుడు బరిలో నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో కంగనా ఆనందం మాములుగా లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇలాంటి దేశ భక్తి సినిమాలు సోలోగానే రావాలని పోటీ ఏదైనా కారణాల తప్పుకుంటే మంచిదేగా అంటూ సెలవిచ్చింది. రాజమౌళి తండ్రి బాహుబలి కథకులు విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన మణికర్ణిక పలు వాయిదాల తర్వాత ఏడు నెలలు ఆలస్యంగా రిలీజవుతోంది. సూపర్ 30 పోస్ట్ పోన్ కు సంబంధించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.