Begin typing your search above and press return to search.
క్రిష్ హీరోయిన్ చెబుతున్న షార్ట్ ఫిలిం లాజిక్
By: Tupaki Desk | 30 Nov 2018 1:30 AM GMTఎన్టీఆర్ బయోపిక్ లో యమా బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ దీని కన్నా ముందే మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం మణికర్ణికకు డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. చాలా భాగం షూటింగ్ పూర్తయ్యాక ఇప్పటికీ బయటపడని కారణాల వల్ల క్రిష్ దాన్ని పూర్తి చేయకుండానే బయటికి వచ్చాడు. సోను సూద్ లాంటి కీలక ఆర్టిస్టులు అందులో నుంచి తప్పుకున్నారు. టైటిల్ పాత్ర పోషిస్తూ ఇందులో నిర్మాతగా సైతం భారీ పెట్టుబడి పెట్టిన కంగనా రౌనత్ మొత్తం తన చేతుల్లోకి తీసుకుంది. వెళ్ళిపోయిన ఆర్టిస్టుల స్థానంలో కొత్తవాళ్ళను తీసుకుని సీన్స్ రీ షూట్ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టుకుంది.
ఇంత రచ్చలోనూ అక్టోబర్ లో టీజర్ విడుదల చేసారు. దర్శకుడిగా దాని వరకు క్రిష్ పేరే ఉంది. కాని ఈ మధ్య మాత్రం అతని పేరు రాకుండా కంగనా జాగ్రత్త పడుతోంది. అయితే దీని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కంగనా చెబుతున్న సమాధానం చాలా విచిత్రంగా ఉంది. తనకు ఇరవై ఏళ్ళ వయసులోనే షార్ట్ ఫిలిం తీసిన అనుభవం ఉందని కాబట్టి మణికర్ణికను హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమి అనిపించలేదట. పైగా కెరీర్ లో చాలా సార్లు రైటర్ గా పైకి చెప్పుకోని డైరెక్టర్ గా పనిచేశానని ఆ నమ్మకంతో ఇప్పుడీ బాధ్యతను నెరవేరుస్తున్నానని చెబుతోంది.
అంతా బాగానే ఉంది కాని కేవలం షార్ట్ ఫిలిం తీసి ఓ రెండు సినిమాలకు పని చేసినంత మాత్రాన మణికర్ణిక లాంటి గ్రాండియర్ ను దర్శకత్వం చేసేంత అనుభవం వచ్చేసినట్టేనా. ఇందులో అయితే లాజిక్ మిస్ అవుతోంది. ఇదంతా సరే కాని క్రిష్ ఎందుకు డ్రాప్ కావాల్సి వచ్చింది అనేదానికి మాత్రం కంగనా సమాధానం చెప్పడం లేదు. పోనీ క్రిష్ ను అడుగుదామా అంటే ఎన్టీఆర్ సెట్స్ లో తప్పించి బయట ఎక్కడైనా కనిపిస్తే ఒట్టు. ఫైనల్ వెర్షన్ లో క్రిష్ పేరు టైటిల్ కార్డ్స్ లో ఎక్కడ వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మణికర్ణిక వచ్చే సంవత్సరం జనవరి 25న విడుదల కాబోతోంది. తన శత్రువుగా భావించే హృతిక్ రోషన్ సూపర్ 30తో డీ కొట్టే అవకాశాలు ఉన్నాయి