Begin typing your search above and press return to search.

స్టార్ హీరో డ్రగ్స్ వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడించిన కంగనా...!

By:  Tupaki Desk   |   29 Aug 2020 6:30 PM GMT
స్టార్ హీరో డ్రగ్స్ వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడించిన కంగనా...!
X
సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ డెత్ మిస్టరీలో బయటపడుతున్న విషయాలు సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. మరో వైపు డ్రగ్ మాఫియాతో లింకులు బాలీవుడ్‌ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్ డీలర్‌ తో రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ బయటకురావడంతో బీ-టౌన్ డ్రగ్ లింకులు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్స్.. ఆమె మీడియాకి వెల్లడిస్తున్న విషయాలు మరింత మంట రేపుతున్నాయి. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని ఒక్కక్క చీకటి కోణాలని ప్రశ్నిస్తూ వస్తున్న కంగనా.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాప్ స్టార్ డ్రగ్స్ వ్యవహారం గురించి తెలుసని.. అందుకే తనని జైలుకు పంపించాలని ప్లాన్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.

కంగనా రనౌత్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను తాను సూపర్ హీరోగా భావించే ఈ టాప్ స్టార్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడని.. టాప్ స్టార్ అని పిలవబడే అతను కోకిలాబెన్ ఆసుపత్రిలో అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకొని ఆసుపత్రి పాలయ్యాడని మరియు అతని లంగ్స్ పై కొంత రియాక్షన్ చూపించడంతో సఫర్ అయ్యాడని చెప్పింది. మాదకద్రవ్యాల అలవాటు కారణంగా టాప్ స్టార్ భార్య మానసిక క్షోభ అనుభవించిందని.. ఆ స్టార్ గతంలో ఒక విదేశీయురాలుతో సంబంధం పెట్టుకున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లాస్ వెగాస్‌ లో తన చిత్రం షూటింగ్‌ లో ఉన్నప్పుడు ఆ స్టార్ దాదాపు ప్రతిరోజూ పార్టీ చేశాడని.. ఈ పార్టీలలో ఎల్‌ఎస్‌డి, కొకైన్, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ ఉంటాయని.. ఈ పార్టీలలో మందులు నీటిలా ప్రవహిస్తాయని.. కొన్నిసార్లు ఈ డ్రగ్స్ పగటిపూట కూడా తీసుకుంటారని కంగనా వెల్లడించింది.

ఈ టాప్ స్టార్‌ తో సినిమా చేసినప్పుడు తమ స్నేహం ఎఫైర్‌ గా మారిందని.. ఈ ఎఫైర్ తెలిసిన తర్వాత తనని బాలీవుడ్ పార్టీలకు పిలవడం స్టార్ చేసారని.. అంతకముందు ఏ పార్టీలకు పిలివలేదని కంగనా చెప్పింది. ఈ టాప్ స్టార్ భార్య ఇప్పుడు అతనితో కలిసి ఉంటోందని.. అయితే అది డబ్బు కోసం కావొచ్చు.. పిల్లల కోసమే ఈ జంట విడాకులు తీసుకోవాలని ఆ స్టార్ కుటుంబం కోరుకోలేదని కంగనా చెప్పుకొచ్చింది. ఆ టాప్ స్టార్ డ్రగ్స్ అలవాటు గురించి తనకు తెలుసు కాబట్టి జైలుకు పంపించాలని అనుకుంటున్నాడని కామెంట్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూలో కంగనా ఆ టాప్ స్టార్ పేరు చెప్పకపోయినా గతంలో అతనికి కంగనాకు మధ్య జరిగిన వ్యవహారం బహిరంగ రహస్యమే.