Begin typing your search above and press return to search.
కరణ్ జోహార్ పై కంగన తీవ్ర విమర్శలు
By: Tupaki Desk | 16 Oct 2018 11:21 AM GMTఇంగ్లీష్ లో 'డ్యామ్డ్ ఇఫ్ యూ డూ.. డ్యామ్డ్ ఇఫ్ యూ డోంట్' అనే ఒక పాపులర్ సామెత ఉంది. అంటే దానర్థం "మీరు చేసినా ఇరుక్కుంటారు.. చేయకపోయినా ఇరుక్కుంటారు". అంటే రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ టాపిక్ పై మాట్లాడం లాంటిది అన్నమాట. మద్దతుగా మాట్లాడితే సగం మంది మంది మీ రక్తం తాగుతారు.. వ్యతిరేకంగా మాట్లాడితే మిగతా సగం మంది మిమ్మల్ని పీక్కు తింటారు. ప్రస్తుతం #మీటూ కాంపెయిన్ పై స్పందన కూడా కాస్తా అటూఇటుగా అలాగే ఉంది. దానిపై మాట్లాడితే లేనిపోని తలనొప్పులు వస్తాయని మాట్లాడకుండా ఉరుకుంటే సరిపోతుందని ఎవరైనా సెలబ్రిటీలు అనుకుంటే వాళ్ళు ఇరుకున్నట్టే.
ఎందుకంటే కరణ్ జోహార్.. షబానా ఆజ్మీ లాంటి సెలేబ్రిటీలు #మీటూ పై ఎందుకు స్పందించడం లేదని బాలీవుడ్ క్వీన్ ఎకిపారేసింది. ఎవరైనా లైంగిక వేధింపులకు గురిచేస్తే వాళ్ళను తిడతారు. లేదా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సమర్థిస్తే కూడా వారిని తిడతారు. మరి కంగనా వీరిద్దరిపై ఎందుకు ఫైర్ అయింది? ఇప్పటికే కంగన 'క్వీన్' సినిమా దర్శకుడు వికాస్ బల్ పై ఆరోపణలు చేసింది. పైగా #మీటూ గురించి ఓపెన్ గా మాట్లాడుతూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతోందనే సంగతి తెలుసు కదా. ఇంత జరుగుతున్నా.. తన లాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంటే కరణ్ జోహర్.. షబానా ఆజ్మీ లాంటి వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది.
కరణ్ శ్రద్దంతా తన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడం పై ఉందని.. జమ్ లో గడిపే ఫోటోనో.. ఎయిర్ పోర్ట్ లో ఉన్నప్పటి ఫోటోనో షేర్ చేసుకుంటున్నాడని.. కన్నతల్లి లాంటి పరిశ్రమలో ఇంత జరుగుతుంటే అతనేమీ పట్టనట్టు ఉండడం ఏంటని నిలదీసింది. కంగన చేసిన ఈ ఘాటు విమర్శలకు కరణ్ సమాధానం చెబుతాడా.. లేదా నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్న పెయింటింగ్ పక్కనే నిలబడి ఓ మాంఛి సెల్ఫీ తీసుకొని దాన్నో యోయో అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడా?