Begin typing your search above and press return to search.
బన్ని-యశ్ లను అడ్డు పెట్టుకుని క్వీన్ పన్నాగం!
By: Tupaki Desk | 25 Jan 2022 3:19 AM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముక్కుసూటి తత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంపిక చేసిన అంశం ఏదైనా అదురు-బెదురు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తుంది. అది విమర్శ అయినా..ప్రశంస అయినా.. ఘాటుగానే ఉంటుంది! తాజాగా మరోసారి కంగన తనదైన శైలిలో దక్షిణాది సినిమాల్ని ఉద్దేశించి మాట్లాడింది. తన ఇన్ స్టా స్టోరీస్ లో సౌత్ స్టార్లు అల్లు అర్జున్...యశ్ లను టార్గెట్ చేసి ప్రశంసలు కురిపించింది.
బన్ని..యశ్ ఫోటోలని షేర్ చేస్తూ..కన్నడ..తెలుగు పరిశ్రమల్ని ఆకాశానికి ఎత్తేసింది. ``దక్షిణాది సినిమాల్లో దేశ సంస్కృతి..సంప్రదాయాలు..మూలాలు కనిపిస్తాయి. అక్కడి హీరోలు తమ కుటుంబాల్ని ఎంతగానో గౌరవిస్తారు. ప్రేమిస్తారు. బంధాలకు విలువలుంటాయి. వారి వృత్తి నైపుణ్యం..అభిరుచి అసాధారణమైనది`` అని రాసుకొచ్చింది.
పనిలో పనిగా బాలీవుడ్ ని ఇందులోకి లాగి తెలివిగా విమర్శించింది. బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయాలని ప్రయత్నిస్తుంది. దయచేసి వారి వలలో చిక్కుకోకండి అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో యాడ్ చేయడం కొసమెరుపు. మొత్తానికి ఇక్కడ కంగన మనసులోని మాటని బయట పెట్టినట్లు అయింది. ఇటీవలే బన్నీ `పుష్ప -దిరైజ్` తో పాన్ ఇండియా రేంజలో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ అయింది. అంతకుముందు `కేజీఎఫ్` కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో యశ్ సౌత్ సహా నార్త్ లో క్రేజీ స్టార్ అయ్యాడు.
వీళ్లిద్దర్ని బాలీవుడ్ లో లాంచ్ చేయాలని దర్శక..నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకేనేమో కంగన ఇలా బాలీవుడ్ వలలో చిక్కుకోవద్దని చెప్పకనే చెప్పినట్లుంది. బన్ని - యష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. కుటుంబ బంధాలు అనుబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కానీ కంగన కు శత్రువులు అయిన అమీర్ ఖాన్.. హృతిక్ రోషన్ లాంటి వాళ్ల వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కల్లోలం గురించి తెలిసిందే. ఆ ఇద్దరినీ అడ్డు పెట్టుకుని వీళ్లందరినీ కంగన టార్గెట్ చేస్తోందన్నది అందరూ గ్రహించేదే.
కంగన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కాక రేపడం ఖాయం. అయితే ఇలాంటి కామెంట్లు కంగనకు కొత్తేం కాదు. వాటిపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోగల నేర్పరి. ఇక కంగన సినిమాల విషయానికి వస్తే `టికు వెడ్స్ షేరు` లో నటిస్తోంది. అలాగే `థాకడ్` లోనూ నటిస్తోంది. మరోవైపు `తేజస్` అనే చిత్రంలో సాహసోపేతమైన ఐలట్ పాత్రని పోషిస్తోంది.