Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఖజురహోను మైమరపిస్తున్న కంగనా

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:11 AM GMT
ఫోటో స్టొరీ: ఖజురహోను మైమరపిస్తున్న కంగనా
X
కంగనా అనగానే ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ క్వీనే అందరికీ గుర్తొస్తుంది. కానీ బాలీవుడ్ లో మరో కంగన ఉంది. ఈవిడ కంగనా శర్మ.. ముంబై భామ. మోడల్ కమ్ నటి. బాలీవుడ్లో 'గ్రేట్ గ్రాండ్ మస్తి' అనే సినిమాలో నటించింది. ఇక టిక్ టాక్ లో యమా పాపులర్ స్టార్. వీటన్నిటితో పాటుగా సోషల్ మీడియాకు వీలైనంత మంట పెడుతూ ఆ వేడితో చలి కాచుకుంటూ ఉంటుంది. ఈ హాటు భామకు ఇన్స్టా లో 859k ఫాలోయర్లు ఉన్నారు.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఒక ఫోటోకు "ఐ వుడ్ లైక్ టు గెట్ ఎ పీస్ ఆఫ్ దట్ సెక్సీ బాడీ.. ఈ పాట వినే ఉంటారుగా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంగ్లీషు సంగీతంలో ఓలలాడే వారు తప్ప ఆ పాట మనలో నిజంగానే చాలామంది విని ఉండము. రెగ్గే గోల్డ్ 2003 అనే ఆల్బమ్ లో సింగర్ సాషా పాడిన పాట ఇది. యూట్యూబ్ లో 'Dat sexy body -Sasha' అని సెర్చ్ కొడితే టక్కున వచ్చేస్తుంది. ఇది ఆమె క్యాప్షన్ లో ప్రస్తావించిన సంగీత చర్చ. ఇక ఫోటో గురించి మాట్లాడుకుంటే.. వైట్ కలర్ ఇన్నర్ వేర్.. పైనేమో బటన్స్ పూర్తిగా వదిలేసిన వైట్ షర్టుతో నిజ్జంగా ఖజురహో శిల్పం తరహాలో సెక్సీ ఎక్స్ ప్రెషన్ తో పాటుగా పోజులిచ్చింది. ఈ ఫోటో చూడగానే ఎట్టాంటి జఫ్ఫా అయినా టెంప్ట్ రవిగా మారిపోవడం ఖాయమే!

ఈ ఫోటోకు కిరాక్ రెస్పాన్స్ వచ్చింది. "కంగనా డోంట్ క్రష్ మీ".. "వైట్ కామసూత్ర".. "వెరీ వెరీ హాట్".. "సో హాట్.. సో సెక్సీ" అంటూ కామెంట్లు పెటారు. పాప ఫోటోల దెబ్బకు ఒక్కసారిగా సోషల్ మీడియా టెంపరేచర్ పెరిగేలా ఉంది కదా?