Begin typing your search above and press return to search.
అలియా తల్లిపై కంగన సిస్టర్ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 17 April 2019 8:27 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ ను అయినా కూడా కంగనా రనౌత్ తనదైన శైలిలో తీసి పక్కన పెట్టేసేలా మాట్లాడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ తో ఈమెకు సరైన అనుబంధం లేదనే టాక్ ఉంది. ఇదే సమయంలో సోదరికి తగ్గట్లుగానే కంగనా సిస్టర్ అయిన రంగోలీ కూడా అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలతో మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆమద్య దర్శకుడు క్రిష్ ను ఉద్దేశించి ప్రస్తుతం సినిమా హిట్ అయిన సంతోషంలో కంగనా ఉంది, ఆమె సంతోషాన్ని పాడు చేయవద్దంటూ వ్యాఖ్యలు చేసింది రంగోలీ. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అలీయా భట్ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసింది.
ఇటీవల అలియా భట్ తల్లి జునైద్ అనే కుర్రాడి గురించి స్పందించింది. జునైద్ ముస్లీం అవ్వడం వల్లే రైలులో చంపబడ్డాడు అంటూ అలీయా భట్ తల్లి సోనీ రజ్దాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోనీ పోస్ట్ పై రంగోలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిటిష్ పాస్ పోర్ట్ పై ఇండియాలో ఉంటున్న కారణంగానే సోనీ రజ్దాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ భారతీయులను కించపర్చుతుందంటూ మండిపడింది. భారతీయులే కాని మీరు ఈ గడ్డపై ఉంటూ ఇండియన్స్ ను దూషించడం ఏంటి, ఈ దేశంలో అసహన పరిస్థితులు ఉన్నాయంటూ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడం ఏంటీ అంటూ సోనీపై రంగోలీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
రంగోలీ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా జనాల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం రంగోలీని తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. అలియా భట్ పై ఉన్న కోపం, అసూయతోనే కంగనా తన సోదరితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించిందని కొందరు, తన సోదరి పేరుతో ఉన్న అకౌంట్ ను కంగనా మేనేజ్ చేస్తూ తన ఉద్దేశ్యంను వెళ్లడించిందని కామెంట్ చేశారు. అలియా నటించిన రాజీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కంగనా తట్టుకోలేక ఇలాంటి బురద జల్లే పని పెట్టుకుందని కొందరు ఆరోపిస్తున్నారు. మరి కొందరు మాత్రం అలియా భట్ తల్లి చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కావని, రంగోలీ వ్యాఖ్యలను సమర్థించారు. మొత్తానికి రంగోలీ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.