Begin typing your search above and press return to search.

కంగన ED- NIA- CBI లాగా ఆలోచిస్తుంది!

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:45 AM GMT
కంగన ED- NIA- CBI లాగా ఆలోచిస్తుంది!
X
ఫైర్ బ్రాండ్ కంగన ర‌నౌత్ ఇటీవ‌లే విడుద‌లైన బ్ర‌హ్మాస్త్ర సినిమాని డిజాస్ట‌ర్ అని ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మాఫియా ఏ సినిమా హిట్టో ఏది ఫ్లాపో ముందే నిర్ధేశిస్తుంద‌ని ఫైర్ అయ్యింది.నకిలీ కలెక్షన్ లను బహిర్గతం చేసిన కంగ‌న‌ ఇన్ స్టాలో సంచ‌ల‌నంగా మారింది. అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన‌ 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న భారీగా విడుద‌ల కాగా ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు ద‌క్కాయి.

విడుదల తేదీ నుండి దాని మొదటి వారాంతంలో బాక్స్ ఆఫీస్ సంఖ్యల పై లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది కంగ‌న‌. నిర్మాతలను దూషిస్తూనే ఈ చిత్రం కలెక్షన్లను ప్రశ్నిస్తోంది. తన ఇన్ స్టా కథనాల సిరీస్ లో రణ్ బీర్ కపూర్ .. ఆలియా భట్ లను మాత్రమే కాకుండా నిర్మాత కరణ్ జోహార్ ని ఆ సినిమా బడ్జెట్ ను కూడా తిట్టింది. 60-70 శాతం ఫేక్ క‌లెక్ష‌న్లే. 410 కోట్ల బడ్జెట్ తో కాదు.. 650 కోట్లతో రూపొందించిన సినిమా ఇది అని పేర్కొంది.

ఇప్పుడు ఇదే విషయంపై జోక్ చేస్తూ కమెడియన్ కునాల్ కమ్రా బ్రహ్మాస్త్రపై కంగనా రనౌత్ చేసిన విమర్శలపై ట్విట్టర్ లో సెటైర్ వేసాడు. ఇడి- ఎన్ ఐఎ- సిబిఐ- ధర్మ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని కంగనా భావిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కంగ‌న స్వ‌యంగా క‌రణ్ ని ఇంట‌ర్వ్యూ చేయాల‌నుకుంటోంద‌ని కూడా వెల్ల‌డించాడు.

కంగ‌న త‌న సామాజిక మాధ్య‌మాల్లో ఏమ‌న్నారంటే...? నేను కరణ్ జోహార్‌ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అతను బ్రహ్మాస్త్ర స్థూల కలెక్షన్ ల‌ను ఎందుకు ప్రకటించాడో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నెట్ కలెక్షన్ లు అవి కావు. ఏమిటీ వైరాగ్యం? 60 కోట్లు సంపాదించిన తర్వాత (అది వారు ప్రకటించిన నికర వసూళ్లు) ఈ సంఖ్యపై నాకు నమ్మకం లేదు. కానీ వారి ప్రకారం రెండు రోజులకు భారతదేశం మొత్తం 60 కోట్లు వ‌సూలైంది. మ‌నం వాటిని నమ్మినా ఇప్పటికే 650 కోట్ల చిత్రం ఎలా హిట్ట‌యిన‌ట్టు? అంటూ విమ‌ర్శించింది.

కరణ్ జోహార్ జీ.. దయచేసి మాకు జ్ఞానోదయం చేయండి. ఎందుకంటే సినిమా మాఫియాకు భిన్నమైన ప్రకృతి నియమాలు .. మాలాంటి మానవులకు భిన్నమైనవిగా ఉన్నాయని నేను భయపడుతున్నాను. అందుకే మీలాంటి ప్రత్యేకాధికారులకు వేర్వేరు లెక్క‌లు..

మాలాంటి నిరుపేదలకు వేర్వేరు లెక్క‌లు... దయచేసి దీనిపై మాకు అవగాహన కల్పించండి అని పోస్ట్ చేసింది. 'బ్రహ్మాస్త్ర' విడుదలైన మొదటి 4 రోజుల్లోనే 138 కోట్లు వసూలు చేసిందని టీమ్ వెల్లడించినా వాటిని కంగ‌న న‌కిలీ లెక్క‌లుగా కొట్టిపారేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.