Begin typing your search above and press return to search.
కంగన వర్సెస్ ఫిలింఫేర్ వార్ తప్పదు!
By: Tupaki Desk | 22 Aug 2022 9:31 AM GMTబాలీవుడ్ క్వీన్..డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ కంగనా రనౌత్ ముక్కుసూటి వ్యవహారం గురించి చెప్పాల్పిన పనిలేదు. వివాదం మొదలైన తర్వాత అమ్మడు ఎవరినైనా టార్గెట్ చేసిందంటే? వాళ్ల అంతు చూసే వరకూ వదిలిపెట్టదు. వ్యవహారం ఎంత దూరం వెళ్లినా తగ్గే ప్రశక్తే ఉండదు. సంగతేంటే తేలో వరకూ విడిచి పెట్టదు. ప్రత్యర్ధి ఎంతటి శక్తివంతమైన వారైనా సరే కంగన భాణాలు సంధిస్తూనే ఉంటుంది.
తాజాగా అమ్మడి కన్ను పిలిం ఫేర్ అవార్డులపై పడింది. మరి వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ...తాజా సన్నివేశం కంగన వర్సెస్ ఫిలింఫేర్ అన్నంతగా వ్యవహారం కనిపిస్తుంది. నువ్వెంతంటే? నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది.
ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కోసం కంగనని నిర్వాహకులు ఎంపిక చేసారు. దానికి సంబంధించి అమ్మడికి ఆహ్వానం పంపారు. దీంతో కంగన ఒక్కసారిగా అంతెత్తున లేచి పడింది. అవార్డులపై దావా వేసి మీ సంగతేంటో తేలుస్తానంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కంగనా ఇలా పేర్కొంది.
'నేను 2014 నుండి @filmfare వంటి అనైతిక.. అవినీతి .. అన్యాయమైన పద్ధతులను నిషేధించాను. కానీ ఈ సంవత్సరం ఫిలింపేర్ అవార్డు ఫంక్షన్‌కు హాజరు కావాలని వారి నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. వారు నాకు కూడా అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు. తలైవి కోసం. వారు ఇప్పటికీ నన్ను నామినేట్ చేస్తున్నారని తెలిసి నేను షాక్ అయ్యాను. అటువంటి అవినీతి పద్ధతులను ఏ విధంగా కూడా నేను ప్రోత్సహించను. అలాంటి వాటిని నా గౌరవం తగ్గించినట్లుగా భావిస్తాను. అలాంటి అవినీత అవార్డులపై దావా వేయాలనకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.
కంగనా వ్యాఖ్యలతో ఫిల్మ్‌ఫేర్ ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఫిల్మ్‌ఫేర్ తన అధికారిక సోషల్ మీడియా ప్రకటనలో ఇలా పేర్కొంది. 'ఈరోజు ఫిలింఫేర్‌లో శ్రీమతి కంగనా రనౌత్ అనవసరమైన హానికరమైన వ్యాఖ్యలకు గురికావడం మాకు బాధ కలిగించింది. ఆరు దశాబ్దాలుగా.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిభను గుర్తించి నిష్పక్షపాతంగా .. అత్యంత పారదర్శకంగా జరుపుతున్నాం.
అలాంటి ప్రతిష్టాత్మక అవార్డలు పై కంగన ఇలా స్పందించడం నచ్చలేదు. 'తలైవి' చిత్రం కోసం అమెని ఎంపిక చేస్తే మాపైనే ఆరోపణలు..విమర్శలు చేస్తుంది. కంగన వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఫిలింఫేర్ అవార్డుల కమిటీ హెచ్చరించింది. మరి వీటిపై కంగన ఎలా స్పందిస్తుందో చూడాలి. వార్ మొదలైన నేపథ్యంలో ఈ వేడి అంత వీజీగా చల్లారదు.