Begin typing your search above and press return to search.
ఫేక్ ట్వీట్ షేర్ చేసి అడ్డంగా బుక్కైన కంగన!
By: Tupaki Desk | 10 Sep 2022 2:30 PM GMTరణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ మూవీ `బ్రహ్మాస్త్ర`. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే విమర్శలకు, సమీక్షకుల నుంచి మాత్రం ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఇదే సమయంలో కంగన ఈ మూవీపై, చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీపై ఘాటుగా స్పందించింది.
అంతటితో ఆగక అయాన్ ముఖర్జీ, కరణ్ జోహార్ లపై నిప్పులు చెరిగింది. అయాన్ ముఖర్జీని జీనియస్ అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలంది. `బ్రహ్మాస్త్ర` తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టిందని, ఈ ప్రయాణంలో 12 మంది సినిమాటోగ్రఫర్లని, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ని మార్చాడని, ప్రొడక్షన్ ఖర్చుల రూపంలో రూ. 600 కోట్లు వృధా చేశాడంటూ విరుచుకుపడింది. ఇక కరణ్ జోహార్ తన సినిమా స్క్రిప్ట్ ల కంటే ఇతరుల శృగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అయితే ఈ సందర్భంగా `బ్రహ్మాస్త్ర`ని డిజాస్టర్ గా తేల్చిన కంగన ..సుమిత్ కడెల్ అనే బాలీవుడ్ క్రిటిక్ పేరుతో వున్న ఓ ట్వీట్ ని రీ ట్వీట్ చేసింది. అందులో `బ్రహ్మాస్త్ర`కు సింగిల్ స్టార్ రేటింగ్ వుండటంతో దాన్ని పట్టుకుని నానా హంగామా చేసింది. అయితే అది సుమీత్ కడెల్ అకౌంట్ కాదు.. ఫేక్ అకౌంట్. దీంతో నెటిజన్ లకు కంగన అడ్డంగా దొరికిపోయింది. విషయం గమనించిన నెటిజన్ లు కంగనని నెట్టింట ఆడుకోవడం మొదలు పెట్టారు.
బ్రహ్మస్త్ర మూవీకి సుమీత్ త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే అతని ఒరిజినల్ అకౌంట్ ని గమనించని కంగన తొందరపడి పప్పులో కాలేసింది. నెటిజన్ లకు అడ్డంగా బుక్కయిపోయింది. దీంతో నెటిజన్ లు కంగన పరువు తీయడం మొదలు పెట్టారు. ఇదిలా వుంటే శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన `బ్రహ్మాస్త్ర` ఇండియా వైడ్ గా రూ. 35 కోట్లకు మించి వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా వైరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 75 కోట్లు రాబట్టి నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ముందు నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో భారీ స్థాయలో బుకింగ్స్ జరిగాయి. దీంతో శనివారం కూడా భారీ స్థాయిలో వసూళ్లు వుండే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వీకెండ్ కావడంతో ఆదివారం కూడా ఈ సినిమాకు భారీ క్రౌడ్ వుంటుందని తెలుస్తోంది. వసూళ్లని బట్టి కంగన చెప్పినట్టుగా `బ్రహ్మాస్త్ర` గత బాలీవుడ్ సినిమాల తరహాలో డిజాస్టర్ గా నిలిచే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.