Begin typing your search above and press return to search.

మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ .. టూమచ్‌

By:  Tupaki Desk   |   9 Aug 2015 7:49 AM GMT
మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ .. టూమచ్‌
X
పురుషాధిక్యంపై ఫైరయ్యే హీరోయిన్ల జాబితా అంతకంతకు పెరుగుతోంది. శ్రీదేవి - ఖుష్బూ - కాజల్‌ - ఇలియానా - నయనతార - నిత్యామీనన్‌ - నందితాదాస్‌ - షబానా ఆజ్మీ - రాధికా ఆప్టే .. కారెవరూ ఈ విమర్శకు అనర్హం. ఇదే బాటలో తమిళ నటి కనిహ కూడా సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నులపై విరుచుకుపడింది. మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ ఆడాళ్లను పైకి రానివ్వదని కనిహ సూటిగా విమర్శించారు. అందుకే తాను కథానాయికగా రాణిస్తున్న రోజుల్లోనే వెనుదిరగాల్సొచ్చిందని అంది. తమిళ్‌ లో ఎక్కువ సినిమాల్లో నటించకపోవడానికి కారణం మహిళా సాధికారతకు సంబంధించిన అవకాశాలేవీ రాకపోవడమేనని సూటిగా దెప్పి పొడిచింది.

అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటివి లేవని, క్యారెక్టర్‌ ఆధారంగా నటించే అవకాశాలిచ్చే పరిశ్రమ ఇదొక్కటేనని చెప్పుకొచ్చింది ఈ సీనియర్‌ నటి. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలోని 'ఓకే బంగారం' (ఓ కాదల్‌ కన్మణి) చిత్రంలో నటించిన కనిహా ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. మేల్‌, ఫీమేల్‌ అన్నది కాదు మంచి సినిమానా కాదా? అన్నదే ఆడియెన్‌ చూస్తారు. నటికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది కూడా చూడరని కనిహ సూటిగా చెప్పింది. కనిహ బిట్స్‌ పిలానీ లో టాప్‌ స్టూడెంట్‌. మిస్‌ చెన్నయ్‌ గా పాపులర్‌ అయ్యాక సినీ నటిగా తెరంగేట్రం చేసింది.