Begin typing your search above and press return to search.
కరోనా : ప్రముఖులను కంగారు పెడుతున్న కనిక తండ్రి వ్యాఖ్యలు
By: Tupaki Desk | 21 March 2020 5:10 AM GMTప్రముఖ బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ లండన్ నుండి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెల్సిందే. అయితే ఆమె లండన్ నుండి వచ్చి రాగానే ఎవరెవరిని కలిసింది.. ఆమె ఎవరి కార్యక్రమాల్లో పాల్గొంది అనే విషయాలను ప్రస్తుతం అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో కనిక తండ్రి రాజీవ్ కపూర్ మాట్లాడుతూ తన కూతురు లండన్ నుండి వచ్చిన తర్వాత మూడు పార్టీ ల్లో 350 నుండి 400 మందితో కలిసిందంటూ చెప్పుకొచ్చాడు.
తాను స్వయంగా పార్టీ ఇవ్వడంతో పాటు మరో రెండు పార్టీలకు కూడా కనిక హాజరయ్యిందని ఆయన చెప్పడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కనిక ఇచ్చిన పార్టీల్లో రాజకీయ ప్రముఖులు ఇంకా సినీ ప్రముఖులు పలువురు హాజరు అయ్యారు. వారి పరిస్థితి ఏంటా అంటూ ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతుంది. కనిక పార్టీలో పాల్గొన్న ఎంపీ దుష్యంత్ సింగ్ ఆ మరుసటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో మరికొంత మంది ఎంపీలతో భేటీ అయ్యాడు.
ఆ సమయంలో ఆయన ఎవరికి కలిశాడు అనే విషయాలపై కూడా విచారణ జరుగుతోంది. కనిక పార్టీలో పాల్గొన్న వారు అంతా కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు. ప్రస్తుతం ఎంపీ దుష్యంత్ ఇంకా ఆయన తల్లి వసుంధర రాజే కూడా స్వీయ నిర్బందంలోకి వెళ్లి పోయారు. కనిక మూడు పార్టీల్లో పాల్గొన్నట్లుగా రాజీవ్ కపూర్ చెబుతూ ఉండగా.. కనిక మాత్రం తాను కేవలం ఒకే ఒక్క పార్టీలో పాల్గొన్నాను అందులో కూడా కేవలం 35 మంది మాత్రమే హాజరు అయ్యారంటూ చెప్పుకొచ్చింది.
ఎవరైనా కనికతో పార్టీలో పాల్గొని ఉంటే వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని.. అలాగే వారిలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే సంప్రదించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి కనిక కారణంగా ప్రముఖులు పలువురు భయాందోళనకు గురవుతున్నారు.