Begin typing your search above and press return to search.
కనిక కపూర్ కు పోలీస్ నోటీసులు.. షాకిచ్చిన పోలీసులు
By: Tupaki Desk | 28 April 2020 8:30 AM GMTకనికా కపూర్.. ఈ బాలీవుడ్ ఫేమస్ సింగర్ కు పోలీసులు షాకిచ్చారు. ఈమె ఇటీవలే కరోనా నుంచి కోలుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా తను ఆస్పత్రిలో ఉండగా కరోనా వైరస్ ను అంటించానని చేసిన తప్పుడు ప్రచారంపై సుధీర్ఘమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టింది. ఆ మరుసటి రోజే పోలీసులు ఆమెకు గట్టి షాకిచ్చారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆమెపై వైద్యులు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపారు.
ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇంట్లోనే లాక్ డౌన్ పీరియడ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. కనిక కపూర్ పోస్టు చేస్తూ.. ‘తాను యూకే లో , ముంబైలో, లక్నోలో కలిసిన వ్యక్తుల్లో ఎవరికి కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని.. వారికి నిర్ధారణ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చిందని’ తెలిపారు. అయితే తనను దోషిగా చూపిస్తూ కథనాలు, కట్టుకథలు అల్లి తనను అభాసుపాలు చేశారని కనిక వాపోయింది. నా నుంచి తప్పు జరిగింది కనుక దాని గురించి మాట్లాడడం లేదన్నారు. నాపై కట్టుకథలు అల్లిన వారు తప్పకుండా పశ్చాత్తాపం పడుతారని కనిక అభిప్రాయపడ్డారు.
అయితే కరోనా సోకకముందు కనికా కపూర్ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. లండన్ నుంచి ఇండియాకు వచ్చిన కనికా కపూర్ దేశంలో దిగాక చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులను కలిసింది. పలు విందులు, కార్యక్రమాల్లో పాల్గొంది. కనికాకు కరోనా లక్షణాలున్నా పెడచెవిన పెట్టి ఇలా క్వారంటైన్ లో ఉండకుండా తిరిగినందుకు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో కూడా కనిక కరోనా చికిత్స కు సహకరించకుండా మొదట గొడవపడింది. ఎట్టకేలకు సహకరించి కోలుకుంది. కరోనా నుంచి పూర్తిగా బయటపడింది. లక్నో వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు విచారణ కోసం కనికా కపూర్ కు నోటీసులు పంపారు.
*తన ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చిన కనిక
కరోనాను జయించిన కనిక కపూర్ తాజాగా కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తన ప్లాస్మా ఇవ్వడానికి ముందుకొచ్చింది. కరోనా రోగులకు చికిత్స కోసం ఆమె తన ప్లాస్మాను దానం చేయడానికి ఆస్పత్రికి వచ్చింది.
కనికా ఫ్లాస్మా నమూనా మంగళవారం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. ముందుగా ఆమెకు కరోనా టెస్ట్ చేసి ఏ దీర్ఘకాలిక వ్యాధులులేవని నిర్ధారించుకున్నాక ఆమె రక్తం లోంచి ప్లాస్మాను తీసుకుంటారు. అర్హత ఉన్నట్లు తేలితే, ఆమె బుధవారం తన ప్లాస్మాను దానం చేస్తుంది.
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో తాజాగా ఒక కరోనా సోకిన ఒక 58 ఏళ్ల వైద్యుడి పరిస్థితి సీరియస్ గా మారడంతో అతడికి ప్లాస్మా చికిత్స చేశారు. అతడు కోలుకున్నాడు. ఇప్పటికే కింగ్ జార్జ్ ఆస్పత్రి కరోనా నుంచి కోలుకున్న ముగ్గురు రోగుల నుంచి ప్లాస్మాను అందుకుంది.