Begin typing your search above and press return to search.
ఆమెను 4 సార్లు టెస్ట్ చేసినా కరోన పాజిటివ్ వచ్చిందట
By: Tupaki Desk | 31 March 2020 1:30 AM GMTబాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆమె లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కనికా యూపీలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఇన్సిట్యూట్ లో చికిత్స పొందుతోంది. పది రోజులుగా ఈమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆమెకు కరోనా టెస్టు నిర్వహించగా నాలుగు సార్లు కూడా పాజిటివ్ అంటూ వచ్చింది. దాంతో ఆందోళన మొదలైంది.
కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఈమె ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. విదేశాలకు తీసుకు వెళ్లి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. కాని విమాన సర్వీస్ లు పూర్తిగా రద్దు అవ్వడం వల్ల ఆమెను విదేశాలకు తీసుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం దేవుడిపైనే భారం వేశామంటూ కనికా కపూర్ కుటుంబ సభ్యులు నిర్వేదంతో కామెంట్స్ చేస్తున్నారు.
మరో వైపు డాక్టర్లు కూడా కనిక ఆరోగ్యం విషయంలో టెన్షన్ గా ఉందని అంటున్నారు. రెండు వారాల్లో కరోనా నెగటివ్ రావాల్సి ఉంటుంది. కాని ఇప్పటికి నాలుగు సార్లు టెస్టు చేసినా కూడా అన్ని సార్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తూ మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేలా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా వైధ్యులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఆమె కరోనా నెగటివ్ గా మారే అవకాశం ఉందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.