Begin typing your search above and press return to search.
5వ సారి టెస్టులోనూ పాజిటివ్ మరింత టెన్షన్
By: Tupaki Desk | 31 March 2020 1:00 PM GMTబాలీవుడ్ ప్రముఖ సింగర్ కనిక కపూర్ కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆమెను యూపీలోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్సిట్యూట్ లో ఐసోలేషన్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆమె కరోనా పాజిటివ్ అని తేలి పది రోజులు దాటింది. ఇప్పటి వరకు అయిదు సార్లు ఆమెకు కరోనా టెస్టు నిర్వహించగా అయిదు సార్లు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వారం నుండి పదిహేను రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల నుండి రికవరీ అవుతున్నారు. అయితే కనికా ఇంకా కూడా నెగటివ్ కు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. విదేశాలకు తీసుకు వెళ్లి చికిత్స అందించాలనుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు అంటూ ఒక కుటుంబ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేయడం మనకు తెల్సిందే. నాల్గవ సారి కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో కనిక కపూర్ ఒక ఓపెన్ లెటర్ రాసిన విషయం తెల్సిందే. అందులో ఆమె ఎమోషనల్ అయ్యింది. నా కుటుంబ సభ్యులపై బెంగగా ఉంది అంటూ అభిమానులను కన్నీరు పెట్టించింది.
రెండు రోజులకు ఒకసారి చొప్పున కనికకు కరోనా టెస్ట్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో సారి టెస్టు చేసే సమయంకు ఆమె కరోనా నెగటివ్ అని తేలాల్సి ఉంది. లేదంటే ఆమె పరిస్థితి మరింత సీరియస్ గా ఉందని భావించవచ్చు అంటూ డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాల్గవ సారి పాజిటివ్ వచ్చిన సమయంలో డాక్టర్లు స్పందిస్తూ ఆమె పరిస్థితి నిలకడగా ఉందని మరో మూడు నాలుగు రోజుల్లో కరోనా టెస్టు నెగటివ్ వస్తుందని భావిస్తున్నామని అన్నారు. కాని ఇప్పుడు మాత్రం వారి నుండి ఎలాంటి స్పందన లేదట.