Begin typing your search above and press return to search.
కనికకు 5వసారి కరోనా పాజిటివ్.. అందరిలోనూ ఆందోళన
By: Tupaki Desk | 3 April 2020 9:30 AM GMTబాలీవుడ్ సింగర్ కనిక కపూర్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత నెల 20న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతనెల 31న రెండు రోజుల క్రితం ఆమెకు 5వ సారి కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షలో కూడా ఆమెకు పాజిటివ్ రావడంతో వారి కుటుంబంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
మార్చి 20 నుంచి 31 వరకు ఏం జరిగింది.? కనికకు ఎలా కరోనా సోకిందనే దానిపై ఆమె కుటుంబ సభ్యులు ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కనిక కపూర్ లండన్ నుంచి మార్చి 9వ తేదీన ముంబై వచ్చారని అక్కడి నుంచి 11వ తేదీన లక్నో వచ్చారని తెలిపారు. అక్కడ పలు పార్టీలకు హాజరయ్యారని.. జ్వరం రావడంతో జ్వరం గోలిని 17న వేసుకున్నారని తెలిపారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో వైరస్ వచ్చిందని అనుమానించి 19న వైద్యులను పిలిపించామన్నారు.
కనిక రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించామన్నారు. ఆ మరునాడు రిపోర్టులో కనికాకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఆమెను వెంటనే లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
ఇక మార్చి 20 నుంచి 31వ తేదీ వరకు ఐదుసార్లు కరోనా టెస్టులు చేసినా ఆమెకు పాజిటివ్ రావడంతో వారి కుటుంబంలో , ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో చేరిన కొత్తలో వైద్యులతో గొడవపడి చికిత్స కు నిరాకరించిన కనిక ఇప్పుడు సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. ఆమెకు నెగెటివ్ వచ్చేదాకా చికిత్స చేస్తామన్నారు.