Begin typing your search above and press return to search.

డైరెక్టర్ భార్య.. తమన్నా డూప్

By:  Tupaki Desk   |   29 Nov 2015 10:30 PM GMT
డైరెక్టర్ భార్య.. తమన్నా డూప్
X
మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఐతే ఒకేలా ఉన్న ఏడుగురిని ఎవరూ చూసి ఉండరేమో కానీ.. సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల్లో పోలికలు ఉండటం చూస్తుంటాం. ఇందుకు ఉదాహరణగా తమన్నా - కనిక థిల్లాన్ లను చెప్పవచ్చు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లాడిన ముంబయి అమ్మాయి కనికలో తమన్నా పోలికలు చాలానే ఉంటాయన్న సంగతి కొంచెం గమనిస్తే అర్థమవుతుంది. వీళ్లిద్దరి కలర్.. ముఖంలో ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి.

మొన్న ‘సైజ్ జీరో’ ప్రీమియర్ షో కోసం ప్రసాద్ ఐమాక్స్ కు వచ్చిన కనికను చూసి చాలామంది తమన్నానే అనుకున్నారట. ఆమె తమన్నానే అనుకుని కొందరు అభిమానులు ఫొటోలు దిగడానికి ప్రయత్నించారట. కొందరు సినీ సెలబ్రెటీలు కూడా దూరం నుంచి ఆమె తమన్నానే అనుకుని పలకరించారట. కానీ దగ్గరికి వచ్చాక కూడా తేడా గుర్తించలేకపోయారు. కనిక గత ఏడాదే ప్రకాష్ ను పెళ్లాడింది. ఐతే ఇప్పటిదాకా ఇండస్ట్రీ జనాలతో పెద్దగా కలిసింది లేదు. మీడియాలో ఆమె ముఖం చాలా తక్కువసార్లు కనిపించింది. ‘సైజ్ జీరో’ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే అందించాకే ఆమె అందరికీ తెలిసింది.