Begin typing your search above and press return to search.
తనను తాను పెళ్లాడిన టీవీ నటి.. శృంగారానికి మగాడి అవసరం లేదట
By: Tupaki Desk | 20 Aug 2022 1:38 AM GMTమారుతున్న కాలానికి తగ్గట్లు కొత్త కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చే వారికి కొదవ ఉండదు. ఇప్పుడు అలాంటి సిత్రమైన వాదనను తెచ్చి.. కొత్త ట్రెండ్ కు తెర తీశారు టీవీ నటి కనిష్కా సోని. ఈ బ్యూటీ 'దియా ఔర్ బాతి హమ్' టీవీ షోతో పాపులర్ కావటం తెలిసిందే.
తాజాగా ఈ అమ్మడు చేసిన ఘనకార్యం ఏమంటే.. తనను తాను పెళ్లి చేసుకోవటం. ఇదేం పద్దతి? అంటూ పలువురు ప్రశ్నించటంతో పాటు.. తిట్టి పోస్తున్నారు. అయితే.. ఆమె మాత్రం అలాంటివి లైట్ తీసుకున్నట్లుగా పేర్కొంటూ తన వాదనను వినిపిస్తున్నారు.
కొత్తగా మెడలో మంగళసూత్రం.. నుదిటిన బొట్టు పెట్టుకున్న ఫోటోల్ని షేర్ చేసిన ఆమె.. టెక్నాలజీ చాలా ప్రగతిని సాధించిందని.. ఒక మహిళ సెక్సుకు మగాడితో పని లేదని పేర్కొన్నారు. పెళ్లి అనేది తనకు చిరకాల వాంఛగా పేర్కొన్న ఆమె.. మాట మీద నిలబడే పురుషుడు ఎవరినీ తాను తన జీవితంలో చూడలేదన్నారు.
అందుకే.. తనను తాను పెళ్లాడినట్లుగా పేర్కొన్నారు. తాను గుజరాత్ కు చెందిన ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. తాను ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో పురుషుడు లేకుండానే జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
తన కలలు.. అవసరాల్ని తానే తీర్చుకోగలనని చెప్పిన ఆమె.. వివాహిత మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరన్నది తన అభిప్రాయమని చెప్పారు.
తాను పలు షోలలో దేవతల పాత్రల్ని పోషించినా.. తనను ఎవరూ గుర్తించలేదని.. ఈ రోజున తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టు చూసి మాత్రం స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి సిత్రమైన వాదనను వినిపించిన కనిష్కా సోని బాటలో మరెందరు నడుస్తారో?