Begin typing your search above and press return to search.
ఆ కన్నడ నటుడి మృతదేహం దొరికింది..!
By: Tupaki Desk | 11 Nov 2016 9:58 AM GMTసినిమా షూటింగ్‌లో భాగంగా ఇద్దరు నటులు ప్రమాదంలో చిక్కుకుని మరణించిన ఎంత సంచలనమైందో తెలిసిందే. అయితే, కన్నడ చిత్రం ‘మస్తీ గుడి’ షూటింగ్ లో ఈ విషాధం చోటు చేసుకుంది. హెలీకాప్టర్ నుంచి దూకుతూ ఓ స్టంట్ సీన్ చేస్తుండగా నటుడు అనిల్ - స్టంట్ మేన్ ఉదయ్ లు నీళ్లలోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు! అయితే, ఘటన జరిగిన వెంటనే గాలింపులకు దిగినా ఇద్దరి మృతదేహాలూ లభించలేదు. గల్లంతైన తొలిరోజంతా ఇద్దరి కోసం తీవ్రంగానే గాలించారు. కానీ, ఉపయోగం లేకపోయింది. మర్నాడు మరింతమంది గజ ఈతగాళ్లనూ ఇతర సిబ్బందినీ రంగంలోకి దించి గాలింపులు చర్యలు చేపట్టడంతో ఉదయ్ మృతదేహం లభించింది. కానీ, అనిల్ ఏమయ్యాడు అనేది మాత్రం ఆచూకీ దొరక్కుండా పోయింది. ఆరోజు నుంచి వరుసగా రెండు రోజులపాటు ఎంత గాలిస్తున్నా అనిల్ ఏమయ్యాడో... అతడి మృతదేహం ఏమైంది అనేది మాత్రం ఉత్కంఠగా మిగిలింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
తమవాడు చనిపోయాడన్న బాధలో ఉన్నవారికి, వాడి మృతదేహం కూడా కనిపించకుండా పోయిందని తెలిస్తే ఆ ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేం. అయితే, ఎట్టకేలకు భారీ ప్రయత్నంతో గురువారం నాడు అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. 50 మంది గజ ఈతగాళ్లు దాదాపు మూడు రోజులు శ్రమించి నీళ్లలో గాలిస్తే... ప్రమాదం జరిగిన స్థలానికి చాలాదూరంలో అనిల్ డెడ్ బాడీని గుర్తించగలిగారు. నీటి అడుగు భాగంలో కదలిక వల్లనే మృతదేహం అంతదూరం వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేశారు.
అనిల్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి, లాంఛనాలు పూర్తి చేశారు. ఈ ప్రమాదం వెనక చిత్ర యూనిట్ నిర్లక్ష్యమే కారణమని, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా భారీ స్టంట్స్ సీన్స్ ఎలా చేస్తారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకోపక్క, ఈ చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు మరికొంతమంది యూనిట్ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/