Begin typing your search above and press return to search.
సంచలనంగా మారిన యువహీరో మృతి
By: Tupaki Desk | 2 Aug 2017 8:18 AM GMTతెలుగు ప్రజలకు సుపరిచితుడైన కన్నడ సినీ నటుడి అనుమానస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన 35 ఏళ్ల ధ్రువ్ శర్మ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా బెంగళూరులోని రాజన్న కుంట్టె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతోనే తన కొడుకు విషం తాగినట్లుగా ధ్రువ్ శర్మ తండ్రి చెబుతున్నారు. పురుగుల మందును తాగినట్లుగా గుర్తించిన ధ్రువ్ శర్మ కుటుంబ సభ్యుల్ని ఆయన్ను హుటాహుటిన వారింటికి సమీపంలోని కొలంబియా ఏషియా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఆయన మరణించారు. పుట్టుకతో మూగ..చెవిటి అయినప్పటికీ పట్టుదలతో నటనలో శిక్షణ పొంది.. కన్నడ సినిమాల్లో హీరోగా నటించి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకున్నారు.
భార్య.. ఇద్దరు పిల్లలున్న ధ్రువ్ శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
పట్టుదలతో తనకున్న వైకల్యాన్ని అధిగమించి సినిమా రంగంలోనూ.. క్రికెట్ లోనూ రాణించాడు. భారత దివ్యాంగుల క్రికెట్ జట్టులోనూ ఆడిన ధ్రువ్ శర్మ మరణం కన్నడ సినీ పరిశ్రమకు షాకింగ్ గా మారింది. స్నేహాంజలి చిత్రంతో కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన.. ఈ మధ్యనే నటించిన కిచ్చు చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి వేళలో ఆయన అనుమానాస్పద రీతిలో మరణించటం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది.