Begin typing your search above and press return to search.
గుండెనొప్పితో ఆసుపత్రిలో సూపర్ స్టార్
By: Tupaki Desk | 6 Oct 2015 1:28 PM GMTప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం జిమ్‌లో ఆయన కసరత్తులు చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఈ విషయాన్ని జిమ్ మేనేజర్ వెంటనే శివరాజ్ కుమార్ భార్య గీతకు తెలిపగా వారు వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో శివరాజ్ కుమార్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్టు నిర్దారించారు.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాళ్లో రెండు చోట్ల అడ్డంకులను డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఆంజియోప్లాస్టీ చేస్తున్నట్టు రాజ్ కుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా రెండు రోజుల పాటు ఆయన్ను పూర్తిగా వైద్యుల సంరక్షణలోనే ఉంచుతారని సమాచారం.
ప్రముఖ కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ వారసుడిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ కుమార్ కన్నడ కంఠరవుడిగా ప్రఖ్యాతిగాంచాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. శివరాజ్ కుమార్ వయస్సు 54 సంవత్సరాలు. శివరాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినట్టు తెలియగానే కర్ణాటకలో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.