Begin typing your search above and press return to search.

మనోడికి వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌ లో చోటు

By:  Tupaki Desk   |   15 Aug 2019 9:31 AM GMT
మనోడికి వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌ లో చోటు
X
హీరోలు అప్పుడప్పుడు దర్శకులుగా మారడం మనం చూస్తూనే ఉంటాం. అయితే వారు ఫుల్‌ టైం దర్శకులుగా కొనసాగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. హీరోలు దర్శకత్వం చేయడం.. దర్శకులు హీరోలుగా నటించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఒక హీరో 9 సినిమాలకు దర్శకత్వం చేయడం.. ఆ చిత్రాలతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరడం జరిగింది. ఆ హీరో మరెవ్వరో కాదు కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర. తెలుగు వారికి కూడా సుపరిచితుడైన ఉపేంద్రకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది.

బీఎండీబీ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులను ఎంపిక చేయడం జరిగింది. ఆ జాబితాలో సౌత్‌ ఇండియా నుండి కేవలం ఉపేంద్రకు ఛాన్స్‌ దక్కింది. 50 మంది దర్శకులను ఈ సంస్థ ఎంపిక చేస్తే అందులో 17వ స్థానంను ఉపేంద్ర దక్కించుకున్నాడు. కన్నడంలో 'ఏ', 'ఓం' చిత్రాలతో పాటు ఇంకా చాలా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఇక బాలీవుడ్‌ ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌ కుమార్‌ ఇరానికి రెండవ స్థానం దక్కింది. ఇక ఇండియన్‌ దర్శకుల్లో సత్యజిత్‌ రే కి కూడా జాబితాలో చోటు దక్కింది. సౌత్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లు తెరకెక్కించిన దర్శకులు ఉండగా ఉపేంద్రకు ఆ జాబితాలో చోటు దక్కడం చూస్తే కమర్షియల్‌ డైరెక్టర్స్‌ కాకుండా వైవిధ్యభరితంగా సినిమాలను తీసే వారిని ఈ జాబితాలోకి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఉపేంద్ర తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. ఇక ఆయన దర్శకత్వం వహించిన ఏ మరియు ఓం చిత్రాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెల్సిందే.