Begin typing your search above and press return to search.
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ.. వికటించి హీరోయిన్ మృతి
By: Tupaki Desk | 17 May 2022 10:44 AM GMTసినీ ఇండస్ట్రీలో ఉండే వారికి అందం అత్యంత ముఖ్యం.. సినిమా నటీమణులు అందం కోసం ఎంతదాకైనా ప్రాకులాడుతారు. అందమైన ఆకృతి కోసం ముఖాన్ని మార్చుకున్న హీరో హీరోయిన్లు ఎందరో.. ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. ఇలానే ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిన ఓ నటి తన ప్రాణాలు కోల్పోవడం సినీ ఇండస్ట్రీలో విషాదం నింపింది.
సినిమా నటి అనగానే గ్లామర్ ప్రపంచం.. లగ్జరీ లైఫ్ అనుకుంటాం.. కానీ ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలు ఉంటాయన్న సంగతి అస్సలు మరిచిపకూడదు. వాళ్ల గ్లామర్ వెనుక, ప్రాణాంతకమైన ముగింపు కూడా ఉంటుంది. తాజాగా ఓ నటిని అది వెంటాడింది.పెద్ద హీరోయిన్ కావాలని కలలు కన్న కన్నడ యువ నటి చేతనరాజ్ కలలు కల్లలయ్యాయి.
అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చేతన రాజ్ కు నిరాశే మిగిలింది. అందం రెట్టింపు చేసుకుంటే కెరీర్ సెట్ అవుతుందని ఆశపడింది.చివరకు ప్రాణాలనే కోల్పోయింది. చేతన రాజ్ ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను సంప్రదించింది. ఈనెల 16న సర్జరీ కోసం ఆమె ఆస్పత్రిలో చేరింది. సర్జరీ అయ్యాక సడెన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది.
వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేసినా.. ఆమె ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె ఆకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ విషాదంలో సినీ ఇండస్ట్రీ తప్పుతోపాటు సరైన వైద్య పరికరాలు, నిపుణులు లేకుండా వైద్యంచేసిన ఆస్పత్రిది తప్పే. ఇలాంటిసర్జరీలు కేవలం చేతన రాజ్ మాత్రమే కాదు.. హీరోయిన్స్ కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు.కానీ వాళ్లు విదేశాలకు వెళ్లి మంచి ఆస్పత్రుల్లో వీటిని చేసుకుంటున్నారు. రిస్క్ అని తెలిసినా శరీరాకృతి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ల అందమే వారిని ఈ దుస్థితికి దిగజార్చేలా చేస్తోంది. వారి ప్రాణాలు తీస్తోంది.