Begin typing your search above and press return to search.

కమ్ముల కొత్త హీరోయిన్ ఈ బ్యూటీనే

By:  Tupaki Desk   |   19 Dec 2018 10:52 AM GMT
కమ్ముల కొత్త హీరోయిన్ ఈ బ్యూటీనే
X
శేఖర్ కమ్ముల సినిమాలు వరస గా ఫ్లాపవుతున్న దశలో 'ఫిదా' విజయం ఆయనను మరోసారి హాట్ షాట్ డైరెక్టర్ గా మార్చింది. శేఖర్ కమ్ముల ఒక సినిమా కు మరో సినిమా కు మధ్య గ్యాప్ ఎక్కువగా తీసుకుంటాడు. కథ తయారు చేసుకోవడం.. నటీనటుల ఎంపిక లాంటివాటిమీద ఎక్కువ సమయం వెచ్చిస్తాడు శేఖర్. 'ఫిదా' తర్వాత అలానే గ్యాప్ తీసుకున్న శేఖర్ కొత్త నటుల తో ఒక ప్రేమ కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటికే శేఖర్ కమ్ముల హీరో ను ఫైనలైజ్ చేసుకున్నాడట. ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కుమారుడిని శేఖర్ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడట. కానీ ఆ యువ హీరో ఎవరన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కన్నడ బ్యూటీని శేఖర్ కమ్ముల ఫిక్స్ చేశాడట. అమృత అయ్యర్ పేరున్న ఈ భామ తమిళంలో విజయ్ అంటోనీ సినిమా 'కాళి' లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కన్నడ లో కూడా ఒక సినిమా సైన్ చేసిందట. ఈమధ్యే ఈ భామ హైదరాబాద్ వచ్చి ఆడిషన్లో పాల్గొని కమ్ముల సార్ ను మెప్పించిందట.

ఈ సినిమా కు ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాను ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ నిర్మిస్తాడు.