Begin typing your search above and press return to search.

సీక్రెట్ పెళ్లి చేసుకున్న యువనటి.. నెట్టింట వైరల్!

By:  Tupaki Desk   |   12 Jun 2020 9:52 AM GMT
సీక్రెట్ పెళ్లి చేసుకున్న యువనటి.. నెట్టింట వైరల్!
X
ఈ కరోనా లాక్ డౌన్ సినిమాలు.. సినిమా షూటింగ్స్.. ఆపగలిగింది కానీ జరుగుతున్న పెళ్లిళ్లను మాత్రం ఆపలేకపోతుంది. దొరికిందే టైం అని గుట్టుచప్పుడు కాకుండా.. పెద్దగా ఖర్చులు లేకుండా హీరోలు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇక తాజాగా అదే పని చేసింది ఓ కన్నడ యువనటి. ఆమెనే మయూరి క్యాటరీ. ఇటీవలే ఈమె పెళ్లి మీడియాలో సంచలనం రేపుతోంది. జూన్ 12వ తేదీ ఉదయమే.. అంటే ఈరోజు మయూరి పెళ్లి వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది. లాక్‌డౌన్లో మయూరి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక మయూరి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు.. తన బాల్య స్నేహితుడు అరుణ్ నే చేసుకుంది. ఇదివరకే పలుమార్లు ఇద్దరు కలిసి మీడియా కంట పడ్డారు. కానీ ఏమి స్పందించలేదు. సడన్ గా ఈరోజు బెంగళూరులోని జేపీ నగర్.. శ్రీ తిరుమలగిరి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరుణ్‌ను మయూరి క్యాటారీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఎలాగో చేసేసుకుంది కదా అని.. నవ దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనంతరం తన పెళ్లి గురించి మయూరి క్యాటరీ ఇన్స్‌టాగ్రామ్ లో స్పందించింది. "అవును.. నేను అరుణ్‌ను జూన్ 12వ తేదీన వివాహం చేసుకొన్నాను. పదేళ్ల మా స్నేహానికి ఈ రోజు అర్ధవంతమైన ముగింపు లభించింది. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అందిస్తాను" అని మయూరి తన సందేశాన్ని పోస్టు చేసింది. ఇక పెళ్లి ఫోటోలు చూస్తే.. పెళ్లి బట్టల్లో మయూరి మరింత అందంగా కనిపించింది. స్వయంగా డిజైన్ చేసుకొన్న బంగారం రంగు సిల్క్ చీరలో ధగధగమెరిసిపోయిందని చెప్పాలి. ఇక పెళ్ళికొడుకు అరుణ్ సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తలపై పాగా ధరించి కనిపించాడు. వీరి సీక్రెట్ పెళ్ళికి ఇరు కుటుంబాలు హాజరయ్యారట. మరి త్వరలోనే తన పెళ్లి విషయాలు బయట పెడతాను అని చెప్పింది. తుపాకీ మీడియా తరపున మయూరికి శుభాకాంక్షలు!!!