Begin typing your search above and press return to search.
బాహుబలిని చూడొద్దంటున్న ఆ డైరెక్టర్లు
By: Tupaki Desk | 2 May 2017 2:10 PM GMTఓవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’ దెబ్బకు అన్ని ఇండస్ట్రీలు షేకైపోతున్నాయి. ఈ సినిమా చూసిన సెలబ్రెటీలు వేనోళ్ల పొగిడేస్తున్నారు. ఈ సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు. కానీ కన్నడ పరిశ్రమకు చెందిన దర్శకులు మాత్రం బాహుబలి చూడొద్దంటూ పిలుపునిస్తుండటం విశేషం. ‘బాహుబలి: ది కంక్లూజన్’ దెబ్బకు కన్నడ సినిమాలకు గట్టి దెబ్బే తగిలింది. ఇప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. కొత్తగా ఇప్పుడిప్పుడే సినిమాలుు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు.. సినీ ప్రముఖులు.. ‘సో నో టు బాహుబలి’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేయడం విశేషం.
చాలామంది పేరున్న దర్శకులు కూడా బాహుబలి చూడొద్దంటూ వీడియో సందేశాలు ట్విట్టర్లో పెట్టడం గమనార్హం. బాహుబలి బదులు కన్నడ సినిమాలు చూడాలని.. కన్నడ పరిశ్రమను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. బాహుబలి లాంటి సినిమాలు వచ్చినపుడు కన్నడ సినిమాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. కన్నడ సినిమాల్ని తీసేసి థియేటర్లన్నింటినీ ఇలాంటి భారీ సినిమాలతో నింపేస్తున్నారని.. ముఖ్యంగా తెలుగు సినిమాల వల్ల తమ ఇండస్ట్రీ చాలా నష్టపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి-2 విడుదలకు ముందు కూడా కర్ణాటకలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఐతే సత్యరాజ్ కన్నడిగులకు సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగి సినిమా యధావిధిగా రిలీజైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/