Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌పై క‌న్న‌డ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారా?

By:  Tupaki Desk   |   12 March 2022 4:30 PM GMT
జ‌క్క‌న్న‌పై క‌న్న‌డ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారా?
X
రాధేశ్యామ్‌, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల త‌రువాత అత్యంత క్రేజ్ ని సొంతం చేసుకున్న మూవీ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`. రాఖీ భాయ్ య‌ష్ న‌టించిన ఈ చిత్రం కోసం మునుపెన్న‌డూ లేని స్థాయిలో ప్రేక్ష‌కులు, య‌ష్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్` కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూశారో అదే స్థాయి ఆస‌క్తితో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కోసం అంతా ఎదురుచూస్తున్నారు. బ‌జ్ కూడా భారీ స్థాయిలోనే వుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం కాయంగా క‌నిపిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఫ‌స్ట్ పార్ట్ రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డంతో చాప్ట‌ర్ 2పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. చాలా కాలంగా వాయిదాప‌డుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించేశారు. అయితే ప్ర‌మోష‌న్స్ ని మాత్రం ప్రారంభించ‌డం లేదు. ఈ విష‌యంలో ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవుతున్నార‌ట‌. ఇదే విష‌యంపై మేక‌ర్స్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీశారు కూడా.

రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధ‌ప‌డుతున్నార‌ట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌మౌళి అని, అత‌ని `ఆర్ ఆర్ ఆర్‌` కార‌ణంగానే కేజీఎఫ్ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నార‌ట‌. అంతే కాకుండా `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ త‌రువాతే `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ప్ర‌మోష‌న్స్ ని మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ వున్నార‌ని, వారి ఆలోచ‌న‌కు కార‌ణం రాజ‌మౌళినే అని క‌న్న‌డ ఫ్యాన్స్ ఆయ‌న‌పై గుర్రుగా వున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతే కాకుండా `ఆర్ ఆర్ ఆర్‌` స్థానంలో `కేజీఎఫ్` వుంటే రాజ‌మౌళి ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే వాడా? అని మండిప‌డుతున్నార‌ట‌. ఇదిలా వుంటే రాజ‌మౌళి పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్‌` విడుద‌ల‌య్యాకే `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. అదే పంథాను `కేజీఎఫ్` టీమ్ కూడా ఫాలో అవ్వాల‌నుకుంటోంద‌ట‌. కానీ ప్ర‌మోష‌న్స్ కి మ‌రీ ఇంత లాగ్ ఎందుక‌న్న‌ది మాత్రం ఫ్యాన్స్ కి అంతుచిక్క‌డం లేద‌ట‌.