Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ ద్రోహి అయిపోయిందే

By:  Tupaki Desk   |   28 Jan 2016 10:04 AM GMT
పవన్ హీరోయిన్ ద్రోహి అయిపోయిందే
X
అత్తారింటికి దారేది మూవీతే ప్రణీత తలరాతే మారిపోయింది. పవన్ పక్కన ఒక్క బ్లాక్ బస్టర్ లో నటించగానే.. ఈ హీరోయిన్ కెరీర్ రయ్యిన దూసుకుపోయింది. తెలుగులో మహేష్ సరసన కూడా ఆఫర్ పట్టేసింది. అంతే కాదు తమిళ్ లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఇఫ్పుడీ హీరోయిన్ ద్రోహి అయిపోయింది. తెలుగు - తమిళ్ చిత్రాల్లో బిజీగా ఉన్నా ప్రణీత నేటివ్ ప్లేస్ కర్నాటక. అయితే అక్కడ పెద్దగా ఆఫర్స్ ఈమె చెంతకు రాలేదు. ఇక్కడేమో మంచి ప్రాజెక్టులు రావడంతో మకాం మార్చేసింది.

అదే సిన్సియారిటీని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా ప్రదర్శిస్తోంది. ఈ సారి ప్రణీత తెలుగు వారియర్స్ కు మద్దతునిస్తోంది. ఇది కన్నడ సినీ అభిమానులకు బాగా కోపం తెప్పించింది. గతంలో కన్నడ సెలబ్రిటీ క్రికెట్ టీంకి సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో వారికి బాగా మండుకొచ్చింది. ఈ కోపాన్ని అమ్మడిపై బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. ఐ హేట్ యు - ఇలా ఎలా చేస్తున్నావ్ వంటి ట్వీట్లతో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అంతే కాదు.. కొందరైతే ఈమెను ఓ ద్రోహికింద జమ కట్టేస్తున్నారు. ఈ పరిస్థితితో ప్రణీత బాగానే హర్ట్ అయింది.

'నేను ఏ టీం కావాలని అనుకుంటే ఆ టీం ని ఎంచుకోవచ్చని వారు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నేను తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటిస్తుండడంతో.. తెలుగు వారియర్స్ కు మద్దతు పలకాలని అడిగారు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా' అంటూ వివరణ ఇచ్చింది. సినిమా అనేది అసలు ముఖ్యమైన పాయింట్ కాబట్టి.. అన్ని ఇండస్ట్రీలను సమానంగానే చూస్తాను, అన్ని టీంలకు మద్దతు ఇస్తాను అని చెప్పి కన్నడ జనాలను కూల్ చేసే ప్రయత్నం చేస్తోంది.