Begin typing your search above and press return to search.

ఉపేంద్ర గురువు ఇక లేరు

By:  Tupaki Desk   |   18 Jan 2018 11:13 AM GMT
ఉపేంద్ర గురువు ఇక లేరు
X
క్రేజీ స్టార్ ఉపేంద్ర సినిమాలు చూసే వారికి వచ్చే డౌట్ ఒకటే. ఇంత వెరైటీగా విలక్షణంగా ఉప్పి ఎలా ఆలోచిస్తాడా అని. దాని వెనుక ఒక గురువు ఉన్నారు.ఆయనే కాశీనాథ్. శృంగార భరితమైన హాస్య చిత్రాల ద్వారా 90వ దశకంలో ఈయన చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. పెద్ద హీరోల సినిమాలకు పోటీగా ఈయన డబ్బింగ్ సినిమాలు వసూళ్లు తెచ్చేవి. తర్వాత రూటు మార్చి దర్శకుడిగా - నటుడిగా అశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కాశీనాథ్. ఈ రోజు అనారోగ్య కారణంగా కన్ను మూసిన కాశీనాథ్ శాండల్ వుడ్ ని శోకంలో ముంచెత్తి వెళ్ళిపోయారు. ఉపేంద్ర తన కెరీర్ తొలి అడుగులు ఈయన దగ్గరే నేర్చుకున్నారు. దర్శకుడిగా ఉపేంద్ర మొదటి సినిమా ష్ లో కాశీనాథ్ డైరెక్టర్ పాత్రలో జీవించారు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయిన కాశినాథ్ చివరి చిత్రం చౌకా. గత ఏడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

గత ఐదారేళ్ళ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న కాశీనాథ్ ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. అది ఒలు మున్సామీ. అది త్వరలోనే విడుదల కానుంది. కాశీనాథ్ మరణం గురించి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అపురూపద అతిధిగలు సినిమా ద్వారా 1976లో సినిమాల్లోకి ప్రవేశించిన కాశీనాథ్ నటించినవి కేవలం 45 సినిమాలే. అందులో ఆయన దర్శకత్వం వహించినవే ఎక్కువగా ఉంటాయి. స్వతహాగా అందగాడు కాని కాశీనాథ్ అంత ఇమేజ్ కేవలం తన యాక్టింగ్ , టేకింగ్ ద్వారానే తెచ్చుకున్నారు. ఎన్ని అవకశాలు వచ్చినా కథ నచ్చితే తప్ప చేయని అలవాటు ఉండటం వల్లే కాశీనాథ్ చాలా తక్కువ సినిమాల్లో ఉన్నారు.అంత జబ్బు ఉన్నా మాటవరసకు కూడా తనకు చెప్పలేదని, టీవిలో చూసాకే తాను షాక్ తిన్నానని, ఒకరి దగ్గర బాధలు చెప్పుకునే అలవాటు లేని కాశీనాథ్ తనకు దైవం కన్నా ఎక్కువ అని ఆసుపత్రి కి వచ్చిన ఉపేంద్ర కంటతడి పెట్టుకున్నారు. కాశీనాథ్ వయసు 65 సంవత్సరాలు.ఈయన సూపర్ హిట్ మూవీ అవలే నన్న హెండతిని 1992లో అమీర్ ఖాన్ హీరోగా హిందిలో రిమేక్ చేసారు