Begin typing your search above and press return to search.
ఆ 'డైరెక్టర్'ని నిన్న లేపారు.. నేడు బాగా దింపుతున్నారు!
By: Tupaki Desk | 21 May 2020 1:30 PM GMT‘కెజిఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్.. అదే ట్వీట్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేయడంతో.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ కొత్త కేజీఎఫ్ రక్తం ఉరకలు వేసిందని చెప్పాలి. ఎన్టీఆర్ 31వ సినిమా ఇదే అని చర్చ మొదలైంది. ‘‘మొత్తానికి అణు కర్మాగారం (నూక్లియర్ ప్లాంట్) పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదర! ఈరోజు మీకు ఎంతో సురక్షితంగా, గొప్పగా ఉండాలి. త్వరలోనే కలుద్దాం.’’ అని తన ట్వీట్‌లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఎన్టీఆర్‌ను నూక్లియర్ పవర్ ప్లాంట్‌తో పోల్చడంతో అభిమానులు గాల్లో తేలుతున్నారు.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు రూ.2 కోట్ల భారీ మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారని ఇండస్ట్రీ టాక్. 2022లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ అలా ట్వీట్ చేసాడో లేదో.. కన్నడ ఇండస్ట్రీలో వ్యతిరేక నినాదాలు మొదలయ్యాయి. మన కన్నడ హీరోతో సినిమా చేయకుండా.. తెలుగు హీరోతో చేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారట. కేజీఎఫ్ సినిమాతో ఆకాశానికి లేపిన ప్రేక్షకులే ఇప్పుడు పాతాళానికి తొక్కేయడానికి ట్విట్టర్ వేదికగా పూనుకున్నారట. అంటే వేరే భాష హీరోతో సినిమా చేస్తే ఇలా వ్యతిరేకిస్తారా..? డైరెక్టర్ గా ప్రశాంత్ కి హీరోను సెలెక్ట్ చేసుకొనే స్వేచ్చ కూడా లేదా? అంటూ సినీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దానికి బదులుగా రాజమౌళి, శంకర్ లాంటి వాళ్లే వాళ్ల హీరోలతో తప్ప బయట హీరోలతో చెయ్యట్లేదు. అలాంటిది నువ్ ఎలా ఎన్టీఆర్ తో తీస్తావ్.. అని చెప్తున్నారు. మరి ఓ డైరెక్టర్ గా హీరోని ఎంచుకొనే అవకాశం లేదా అని ప్రశాంత్ సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తుంది.