Begin typing your search above and press return to search.

390+ కేవలం కేజీఎఫ్ 2 కే సాధ్యం

By:  Tupaki Desk   |   2 Jun 2022 3:30 PM GMT
390+ కేవలం కేజీఎఫ్ 2 కే సాధ్యం
X
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ 2 రికార్డుల మీద రికార్డులను నమోదు చేస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కేజీఎఫ్ 2 సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. దంగల్‌.. బాహుబలి 2 మరియు కేజీఎఫ్ 2 అంటూ చరిత్రలో నిలిచి పోయేలా వసూళ్లను దక్కించుకుంది. ఇటీవల వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ ను కూడా క్రాస్ చేసి కేజీఎఫ్ 2 టాప్‌ 3 లో ప్లేస్ దక్కించుకుంది.

కొన్ని విషయాల్లో ఇండియాస్ నెం.1 అన్నట్లుగా కూడా నిలిచింది. ముఖ్యంగా హిందీ వర్షన్ సాధించిన వసూళ్లు ఏ ఇండియన్‌ సినిమా కూడా రాబట్టలేదు. దంగల్ రికార్డును కూడా బ్రేక్‌ చేసిన కేజీఎఫ్‌ 2 ఇప్పుడు మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సినిమాలు ఈమద్య కాలంలో రెండు మూడు వారాలు థియేటర్‌ లో ఆడితే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

మూడు వారాలు ఆడితే నాల్గవ వారంకు ఓటీటీ లో సందడి చేస్తోంది. కేజీఎఫ్ 2 కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయినా కూడా నాలుగు అయిదు వారాలు పూర్తి అయినా కూడా వందల థియేటర్లలో కేజీఎఫ్‌ 2 ఆడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓవర్సీస్‌ లో ఇంకా పది స్క్రీన్‌ ల్లో ప్రదర్శింపబడుతోంది. మరో వైపు ఇండియా మొత్తం మీద ఏకంగా 390 థియేటర్లలో కేజీఎఫ్‌ 2 ఆడుతోంది.

కేజీఎఫ్ 2 సినిమా 50 రోజులు పూర్తి అయ్యే సమయానికి ఇంకా 390 థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది. అది కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నా కూడా ఇన్ని థియేటర్లలో ఆడుతుంది అంటూ అద్బుతమైన రికార్డ్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కన్నడ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో కేజీఎఫ్‌ 2 ను ఇంకా థియేటర్లలో జనాలు చూస్తున్నారు అంటే ఎంతటి విజయం ఈ సినిమా సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 లో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.

కేజీఎఫ్ 1 సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకోవడంతో కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో వెయ్యి కోట్లకు పైగానే కేజీఎఫ్ 2 వసూళ్లను దక్కించుకుంది. ఇండియన్‌ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమాగా.. ఎన్నో అరుదైన రికార్డులను కేజీఎఫ్ 2 దక్కించుకుంది.