Begin typing your search above and press return to search.
ఇప్పుడు అందరి కళ్ళు ఆ కన్నడ సినిమాపైనే...!
By: Tupaki Desk | 18 April 2020 9:50 AM GMTప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని తేడా లేకుండా ప్రతీ సినిమా చూసేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమా చూడండి.. ఆ వెబ్ సిరీస్ చూడండి.. అంటూ నెటిజన్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువ మంది నెటిజన్స్ సజెస్ట్ చేసిన సినిమా 'దియా'. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో కన్నడలో విడుదలైన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా అక్కడ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య నిర్మించగా కేయస్ అశోక దర్శకత్వం వహించారు. పృథ్వీ అంబర్, దీక్షిత్, ఖుషీ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర నిర్మాత కృష్ణ చైతన్య మాట్లాడుతూ దియా చిత్ర రీమేక్ రైట్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉందని.. ముఖ్యంగా టాలీవుడ్ నుండి ఎక్కువగా ఈ చిత్ర రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారని చెప్పాడట. అంతేకాకుండా ఒక యూఎస్ బేస్డ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని కొనుక్కొని డబ్బింగ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడట. అయితే ఇంకా ఆఫిసియల్ గా ఈ చిత్ర హక్కులను ఎవరికి ఇవ్వలేదని 'దియా' నిర్మాత చెప్పుకొచ్చారట. అయితే వాస్తవానికి ఇలాంటి సినిమాలు మన తెలుగులో చాలానే వచ్చాయని చెప్పవచ్చు. అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాకి కొంచెం దగ్గరగా ఉంటుంది 'దియా'. మరి ఈ చిత్రాన్ని మార్పులు చేర్పులు చేసి మన టాలీవుడ్ నిర్మాతలు తెలుగులో రీమేక్ చేస్తారేమో చూడాలి.