Begin typing your search above and press return to search.
ఆహా మరో కన్నడ హిట్ పట్టారు
By: Tupaki Desk | 14 July 2021 3:44 AM GMTతెలుగు ప్రేక్షకులకు ఆహా దగ్గర అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అల్లు అరవింద్ సారథ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ కంటెంట్ విషయంలో విభిన్నమైన పంథాలో అడుగులు వేస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలను మొదలుకుని షో లు మరియు వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా ప్రధానంగా డబ్బింగ్ సినిమాలపై ఎక్కవ దృష్టి పెడుతోంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా ను స్ట్రీమింగ్ చేయడం వల్ల తమ వినియోగదారులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని డబ్బింగ్ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మలయాళం లో మంచి కంటెంట్ తో రూపొందిన సినిమాలను తెలుగు లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా వారు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా డబ్బింగ్ సినిమాలను తీసుకు రావడంతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలను ఒక మోస్తరు సినిమాలను లను కూడా స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. ఇతర ఓటీటీలతో ఒప్పందం కుదుర్చుకుని అప్పుడప్పుడు పెద్ద సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా వారు మరో హిట్ మూవీని పట్టారు. కన్నడంలో రూపొందిన హీరో అనే సినిమా ఈ ఏడాది మార్చి లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్ లు చూడ్డానికి సీరియస్ గా ఉన్నా.. కథ సీరియస్ పాయింట్ అయినా కూడా స్క్రీన్ ప్లే మాత్రం ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది. అందుకే కన్నడ ప్రేక్షకులు హీరో ను ఆధరించారు. ఇప్పుడు ఆ కన్నడ హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
ఆహా వారు తెలుగు లో కన్నడ హీరోను డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అధికారికంగా పోస్టర్ ను కూడా ఆహా వారు విడుదల చేయడం తో ప్రేక్షకులకు మరో మంచి కంటెంట్ మూవీ మరియు కామెడీ మూవీ పడ్డట్లే అంటున్నారు. ఇటీవలే ఆహా వారు స్ట్రీమింగ్ చేసిన విజయ్ సేతుపతి విక్రమార్కుడు సినిమా కు మంచి ఆధరణ లభించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఆ సినిమా లో విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమిళంలో ఒక మోస్తరుగా ఆడిన ఆ సినిమాను తెలుగు లో ఆహా వారు విక్రమార్కుడు అంటూ స్ట్రీమింగ్ చేయడం తో ఆయన అభిమానులు తెగ చూసేస్తున్నారు. విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా కు మంచి వ్యూస్ వస్తున్నట్లుగా ఆహా వారు చెబుతున్నారు. ఇప్పుడు ఆహా నుండి మరో డబ్బింగ్ మూవీగా హీరో రాబోతుంది.
జులై 24వ తారీకున ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ షో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం తో ఆహా ఖాతాదారులు ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు. తెలుగు వారి ఏకైక ఓటీటీ అంటూ ఆహా వారు ప్రచారం చేసి అందుకు తగ్గట్లుగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను విడుదల చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఆహా టీమ్ ఎంచుకుంటున్న సినిమాలు ఏదో ఒక జోనర్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు అన్ని జోనర్ ల వారిని కూడా మెప్పిస్తూ ఉంది. హీరో సినిమా కూడా ఆహా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.