Begin typing your search above and press return to search.
కాంతార... వారి వెయిటింగ్ కి తెర
By: Tupaki Desk | 17 Nov 2022 3:30 PM GMTరిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతార సినిమా దక్కించుకున్న విజయంను వర్ణించడం కూడా సాధ్యం కావడం లేదు. ఒక చిన్న బడ్జెట్ సినిమా వందల కోట్ల వసూళ్లను నమోదు చేయడం ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో జరగలేదు. కానీ ఈ సినిమా ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది.. వండర్ అంటూ అంతా నోరు వెళ్లబెట్టే విధంగా వసూళ్లను కాంతార దక్కించుకుంది.
కాంతార సినిమా యొక్క వసూళ్లు వారం వారం పెరుగుతూ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ను వాయిదా వేస్తూ వచ్చాయి. నిన్న మొన్నటి వరకు కూడా థియేటర్ లో ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోయిన విషయం తెల్సిందే. దాంతో ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
థియేటర్ లో స్క్రీనింగ్ మిస్ అయిన వారు చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయినప్పుడు చూసిన వారి కంటే ఓటీటీ ద్వారా చూస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
కన్నడం లో ఈ సినిమాను అత్యధికులు చూశారు. కానీ ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమాను థియేటర్లలో చూసిన వారు తక్కువే. అందుకే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే వారంలో స్ట్రీమింగ్ చేసేందుకు రిషబ్ శెట్టి రెడీ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
రిషబ్ శెట్టి నటన మరియు దర్శకత్వం కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా అద్భుతమైన కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు సినీ విశ్లేషకులు మరియు విమర్శకులు కూడా రిషబ్ పై కాసుల వర్షం కురిపించడం తో పాటు ప్రశంసలు కురిపించారు. ఓటీటీ లో రిలీజ్ అయితే ఈ సినిమా మరింత ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.