Begin typing your search above and press return to search.

క‌న్న‌డ సినిమా జూలు విదిల్చి సింహ గ‌ర్జ‌న చేస్తోందే!

By:  Tupaki Desk   |   22 Oct 2022 2:30 AM GMT
క‌న్న‌డ సినిమా జూలు విదిల్చి సింహ గ‌ర్జ‌న చేస్తోందే!
X
తెలుగులో మునుపెన్న‌డూ లేనంత‌గా క‌న్న‌డ సినిమాలు సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి. క‌న్న‌డ సినిమా జూలు విదిల్చి సింహ గ‌ర్జ‌న చేస్తోందా? అనేంత‌గా క‌న్న‌డ సినిమాలు రికార్డు స్థాయిలో విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి. గంతంలో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు సంద‌డి చేసేవి. కానీ ఇప్పుడు క‌న్న‌డ సినిమా రీసౌండ్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది. క‌న్న‌డ హీరోల్లో ఉపేంద్ర సినిమాలు త‌ప్ప తెలుగులో పెద్ద‌గా మిగ‌తా స్టార్ల‌వి ఆడిన దాఖ‌లాలు చాలా త‌క్కువే. కానీ 'కేజీఎఫ్' సిరీస్ సినిమాల త‌రువాత క‌న్న‌డ సినిమా రీసౌండ్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది.

య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన 'కేజీఎఫ్' సిరీస్ సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో అంతగా ప‌రిచ‌యం లేని హీరోలు త‌మ‌ సినిమాల‌తో తెలుగులో రాణించాల‌ని, సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకోవాల‌ని పోటీప‌డుతున్నారు. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ త‌రువాత తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌లైన ర‌క్షిత్ శెట్టి 'చార్లీ 777, కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ‌' వంటి సినిమాలు క‌న్న‌డ ఇండ‌స్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగేలా చేశాయి.

రీసెంట్ గా రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి తెర‌కెక్కించిన క‌న్న‌డ 'కాంతార‌' రీసెంట్ గా విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ దేశ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. కేవ‌లం రూ. రూ. 16 కోట్ల బ‌డ్జెట్ తో క‌న్న‌డ‌లో నిర్మించిన ఈ మూవీ సాధిస్తున్న వ‌సూళ్ల‌ని చూసి ట్రేడ్ వ‌ర్గాలే విస్తూ పోతున్నాయి. ఇప్ప‌టికే రూ. 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ రానున్న రోజుల్లో ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా క‌న్న‌డ సినిమా జూలు విదిల్చి సింహ‌గ‌ర్జ‌న చేస్తున్న తీరు ప‌లు ఇండ‌స్ట్రీల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే రానున్న రోజుల్లో క‌న్న‌డ సినిమా మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ లు నిర్మాణ ద‌శ‌లో వున్నాయి. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు టీజ‌ర్ లు విడుద‌లై ఆస‌క్తిని రేకెత్తించడం మొద‌లు పెట్టాయి. 'కేజీఎఫ్ 3' ని కూడా య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ చేయ‌బోతున్నారు.

ఇక రానున్న రోజుల్లో ఉపేంద్ర‌, కిచ్చా సుదీప్ క‌లిసి న‌టించిన 'క‌బ్జా' పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 'కేజీఎఫ్' త‌ర‌హా మేకింగ్ తో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. టీజ‌ర్ ఇంప్రెసీవ్ గా వుండటంతో ఈ ప్రాజెక్ట్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ధృవ్ స‌ర్జా హీరోగా న‌టిస్తున్న 'కేడీ ది డెవిల్‌' టీజ‌ర్ ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ప్ర‌తీ సీన్ కేజీఎఫ్ మేకింగ్ ని టేకింగ్ ని గుర్తు చేస్తూనే కొత్త క‌థ చెప్ప‌బోతోంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

ఇక 'పుష్ప‌' విల‌న్ ల‌లో ఒక‌డిగా న‌టించిన క‌న్న‌డ హీరో ధ‌నుంజ‌య 'హెడ్ బుష్‌' ఇప్ప‌టికే విడుద‌లైంది. త్వ‌ర‌లో తెలుగులో రిలీజ్ కాబోతోంది. బెంగ‌ళూరుకు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ ఎం.పీ రాజేష్ బ‌యోపిక్ గా ఈ మూవీని రూపొందించారు. దీనితో పాటు ధ‌నుంజ‌య న‌టిస్తున్న 'ఉత్త‌రకాండ‌'కూడా తెలుగులో రాబోతోంది. దీనికి 'కేజీఎఫ్' నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌ల్ట్ మూవీగా ఇది రూపొందుతోంది. వీటితో పాటు మ‌రికొన్ని క‌న్న‌డ సినిమాలు కూడా రాబోతుండ‌టంతో మునుపెన్న‌డూ లేని విధంగా క‌న్న‌డ సినిమా సింహ గ‌ర్జ‌న చేస్తున్న తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.