Begin typing your search above and press return to search.

9 మంది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని అరెస్ట్‌ చేసిన కన్నడ పోలీసులు

By:  Tupaki Desk   |   23 May 2023 12:01 PM GMT
9 మంది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని అరెస్ట్‌ చేసిన కన్నడ పోలీసులు
X
తెలుగు స్టార్స్ యొక్క అభిమానుల యొక్క అభిమానానికి కొన్ని సార్లు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఆనందంతో థియేటర్లలో క్రాకర్స్ కాల్చడం మొదలుకుని రకరకాలుగా పనులు చేస్తూ నానా హడావుడి చేస్తూ ఉంటారు. అభిమానుల్లో తెలుగు స్టార్‌ హీరోల అభిమానులు వేరయ్య అన్నట్లుగా మనోళ్లు వ్యవహరిస్తూ ఉంటారు.

తాజాగా ఎన్టీఆర్ యొక్క సూపర్‌ హిట్ చిత్రం 'సింహాద్రీ' రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులు చేసిన హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా సాగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఫ్యాన్స్ హడావుడి చేశారు. బాబోయ్‌ వారి హంగామా మామూలుగా లేదు అన్నట్లుగా సాగింది.

కర్ణాటకలోని రాబర్సన్‌ పేట పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన కొందరు అభిమానులు మేక ల యొక్క తలలు నరికి థియేటర్‌ వద్ద హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి 9 మంది అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ వద్ద రెండు మేకలను కోసినందుకు గాను వారిని అరెస్ట్‌ చేయడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

మే 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద కేక్ కట్ చేసి రెండు మేకలను కోసి ఆ రక్తమును ఫ్లెక్సీలపై జల్లడం తో పాటు చుట్టు పక్కల చల్లారట. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి 9 మందిని అరెస్ట్‌ చేయడం జరిగిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.