Begin typing your search above and press return to search.

VD కోసం కన్నడ రికార్డ్‌ వెయిటింగ్‌

By:  Tupaki Desk   |   8 March 2019 10:15 AM GMT
VD కోసం కన్నడ రికార్డ్‌ వెయిటింగ్‌
X
విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో రెడీ అవుతున్న విషయం తెల్సిందే. భరత్‌ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి టీజర్‌ రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈనెల 17న టీజర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు సౌత్‌ ఇండియాలోని అన్ని భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. నాలుగు భాషల్లో కూడా ఒకే టైటిల్‌ తో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఒక సినిమా నాలుగు భాషల్లో ఒకే టైటిల్‌ తో విడుదల అవ్వడం చాలా అరుదు. బాహుబలి విషయంలో మాత్రమే అది జరిగింది.

బాహుబలి సమయంలో కర్ణాటకలో డబ్బింగ్‌ సినిమాలపై బ్యాన్‌ ఉంది. కాని ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దాంతో విజయ్‌ దేరవకొండ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. కర్ణాటకలో డబ్బింగ్‌ సినిమాల బ్యాన్‌ ఎత్తివేసిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే అవ్వనుంది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రానికి ముందు తెలుగులో కొన్ని పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే అవి కన్నడంలో విడుదల కాబోతున్నాయా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాని డియర్‌ కామ్రేడ్‌ మాత్రం ఇప్పటికే కన్నడ ప్రేక్షకుల ముందుకు వెళ్లడంపై కన్ఫర్మేషన్‌ ఇచ్చేశారు.

కన్నడంలో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌ రష్మిక మందన్న. కిట్టీ పార్టీతో అక్కడ ఒక్కసారిగా స్టార్‌ అయిన రష్మిక తాజాగా మరో సినిమాతో కూడా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుని మరింతగా అభిమానం సొంతం చేసుకుంది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో ఆమె హీరోయిన్‌ అవ్వడం వల్ల డబ్బింగ్‌ సినిమా అనే భావన లేకుండా కన్నడ ప్రేక్షకులు 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రాన్ని ఆధరించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏమాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకున్నా భారీగానే వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కన్నడంలో భారీ వసూళ్లు నమోదు చేయబోతున్న తొలి హీరోగా విజయ్‌ దేవరకొండ రికార్డు సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి ఆ రికార్డును మన రౌడీ దక్కించుకుంటాడా అనేది చూడాలి.