Begin typing your search above and press return to search.

వరుణ్‌ సినిమాలో 'కబ్జా' స్టార్‌ నిజమే

By:  Tupaki Desk   |   27 April 2020 1:01 PM GMT
వరుణ్‌ సినిమాలో కబ్జా స్టార్‌ నిజమే
X
తెలుగులో కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు పలువురు మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తమిళ హీరోల పలు సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యి సూపర్‌ హిట్‌ అయ్యాయి. తమిళ హీరోలు సక్సెస్‌ అయినంతగా ఏ భాష హీరోలు కూడా తెలుగులో సక్సెస్‌ కాలేదు. కాని కన్నడ హీరో ఉపేంద్ర మాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు. తెలుగు నటుడే అన్నట్లుగా ఉండే ఉపేంద్ర తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. పలు సినిమాలు తెలుగులో డబ్‌ కూడా అయ్యాయి.

ఈయన చివరగా తెలుగులో సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఆయన మాత్రం తెలుగులో మళ్లీ ఇప్పటి వరకు నటించలేదు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. గత కొన్నాళ్లు వార్తలు వస్తున్న విధంగా తాను తెలుగులో వరుణ్‌ తేజ్‌ సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రం తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని ఎక్కువ శాతం విలన్‌ పాత్రలే ఆఫర్‌ చేశారు. దాంతో నేను ఆ సినిమాల్లో నటించలేదు అన్నాడు. దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి వరుణ్‌ చిత్రం కోసం నన్ను సంప్రదించాడు. అతడు చెప్పిన కథ మరియు పాత్ర నచ్చింది. అందుకే ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను అన్నాడు. మరో వైపు ఈయన కబ్జా అనే కన్నడ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగులో కూడా కబ్జా సినిమా డబ్‌ కాబోతుంది. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. ఇక తెలుగులో ఈయన వరుణ్‌ తేజ్‌ సినిమాలో చేయబోతున్నది విలన్‌ పాత్రనా లేదంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడా అనేది చూడాలి.