Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ‘పవర్ స్టార్’కు గుండెపోటు
By: Tupaki Desk | 29 Oct 2021 7:41 AM GMTశాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ కు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని తెలిపాడు. గుండెపోటుగా నిర్ధారించి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.
ఇక పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన కోలుకోవాలని కోరుతున్నారు.
పునీత్ రాజ్ కుమార్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. అతిథి పాత్రల్లో మెరిసాడు. రాంగోపాల్ వర్మ తీసిన గంధుపు చెక్కల స్మగ్లర్ ‘వీరప్పన్’ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.