Begin typing your search above and press return to search.

య‌శ్ మేధో మ‌థ‌నం ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   4 April 2023 8:00 AM GMT
య‌శ్ మేధో మ‌థ‌నం ఇంకెన్నాళ్లు?
X
క‌న్న‌డ సంచ‌ల‌నం య‌శ్ న‌టించిన `కేజీఎఫ్ 2` రిలీజ్ అయి ఏడాది స‌మీపిస్తుంది. ఈనెల 14 తో స‌రిగ్గా ఏడాది పూర్త‌వుతుంది. గ‌తేడాది ఏప్రిల్ 14 న వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో నూరు శాతం స‌క్సెస్ అయింది. 1250 కోట్ల వ‌సూళ్ల‌తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ని అగ్ర స్థానంలో నిల‌బెట్టింది. స‌రిగ్గా ఇదే అంశం య‌శ్ ని ఎన్నో ర‌కాల ఒత్తిడికి గురి చేస్తుంది.

వాట్ నెక్స్ట్ అనే అంశంపై ఏడాది కాలంగా ఆలోచ‌న చేస్తున్నారు. ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయాలి? ఎలాంటి కంటెంట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి? వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని ఎలా కొన‌సాగించాలి? అని ర‌క‌ర‌కాల సందేహాల‌తో ఏడాది కాలంగా ఎలాంటి సినిమా క‌మిట్ అవ్వ‌కుండా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాస‌స్ లో య‌శ్ కి చాలా మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు చెప్ప‌డం జ‌రిగింది.

సౌత్ నుంచి టాలీవుడ్..కోలీవుడ్ మేక‌ర్స్ పేర్లు జోరుగా వినిపించాయి. అలాగే బాలీవుడ్ అవ‌కాశాలు వ‌చ్చాయి. అక్క‌డ మేక‌ర్స్ సైతం య‌శ్ తో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. చివ‌రిగా మాతృభాష ద‌ర్శ‌కుడు నార్థ‌న్ తో ఓ సినిమాకి క‌మిట్ అయిన‌ట్లు ఆ మ‌ధ్య మీడియాలో బ‌ల‌మైన ప్రచారం సాగింది. దాదాపు ప్రాజెక్ట్ ఒకే అయింద‌ని అక్క‌డ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

అయితే ఇంత వ‌ర‌కూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ పేరు కూడా ఈ లిస్ట్ లో వినిపిస్తుంది. ఆయ‌న‌తోనూ య‌శ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ఇది నిజ‌మే అనుకున్నా? శంక‌ర్ తో సినిమా చేయాలంటే ఏడాది అయినా వెయిట్ చేయాల్సిందే. ప్ర‌స్తుతం ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్`..క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియన్-2` తెర‌కెక్కిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తిచేసి రిలీజ్ అయి శంక‌ర్ బిజీ షెడ్యూల్ నుంచి బ‌య‌ట ప‌డ‌టానికే క‌నీసం ఏడాది అయినా స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో శంక‌ర్ తో ముందుకెళ్లాలంటే య‌శ్ ఏడాది వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు. ఆ ర‌కంగా రెండేళ్లు గ్యాప్ వ‌స్తుంది. ఈ గ్యాప్ ఇమేజ్ పైనా ప్రభావం చూపుతుంది. ఓ పాన్ ఇండియా స్టార్ స‌క్సెస్ రేసులో ఉండి గ్యాప్ తీసుకుంటే? మార్కెట్ పై కొంత వ‌ర‌కూ ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది విశ్లేష‌కులు మాట‌. ఈ నేప‌థ్యంలో ఈ స‌మీక‌ర‌ణాల‌న్నింటిని బ్యాలెన్స్ చేస్తూ య‌శ్ నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది. మ‌రి ఈ మేధో మ‌థ‌నానికి య‌శ్ ఎప్పుడు పుల్ స్టాప్ పెడ‌తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.