Begin typing your search above and press return to search.
నటి సూసైడ్ కేసులో.. ప్రియుడి అరెస్ట్!
By: Tupaki Desk | 8 Jun 2020 7:31 AM GMTకన్నడ యువనటి.. టీవీ యాంకర్ చందన కేసులో పురోగతి లభించింది. ప్రియుడు దినేష్ ను ఆదివారం అరెస్ట్ చేశారు. మే నెల 28న నటి చందన ఓ సెల్ఫీ వీడియోలో తన మరణానికి కారణం తన ప్రియుడు దినేష్ అంటూ చెప్పి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాలు అన్ని విధాలుగా వాడుకొని తీరా పెళ్లికి మొహం చాటేయడంతో నటి చందన ఆ వ్యధను భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన.. మంచి యాక్టర్ కావాలనే కోరికతో కొన్నేళ్ల క్రితం బెంగళూరు వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండేళ్లు పాటు ఇండస్ట్రీలో ప్రయత్నించి పలు కన్నడ టీవీ సీరియల్స్, సినిమాలు, పలు ప్రకటనల్లో నటించింది. ఇదిలా ఉండగా చందన ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న దినేష్ అనే యువకుడితో పరిచయం అయింది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది.
పెళ్లి కాకుండానే వీరి లివింగ్ రిలేషన్ షిప్ సాపీగానే సాగించారు. కానీ కొంతకాలం తర్వాత చందన దినేష్ తో పెళ్లి గురించి ప్రస్తావించింది. ఇక అవసరం తీర్చుకున్న దినేష్ పెళ్ళికి తల అడ్డంగా ఊపడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ పెళ్లి విషయాన్ని దినేష్ తల్లిదండ్రులతో చర్చించడానికి వెళ్లిన చందనకు అక్కడ వారి నుంచి వ్యతిరేకత ఏర్పడింది. వారు దినేష్ తో పెళ్లి చేయమని తెగేసి చెప్పడంతో కాస్త కుంగిపోయింది. అంతేగాక చందన తల్లిదండ్రులతో కూడా దినేష్ తల్లిదండ్రులు గొడవ పెట్టుకుని ఆమె గురించి నీచంగా మాట్లాడారు. అది తట్టుకోలేక మే 28న బెంగుళూరులో బలవన్మరణానికి పాల్పడింది చందన. చనిపోయే ముందు తన ఆత్మహత్యకు కారణం దినేష్ ఇంకా.. అతని పేరెంట్స్ అని తెలియజేస్తూ.. చందన తన ఫోన్లో ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి చనిపోయింది. చందన ఆత్మహత్య గురించి తెలియగానే దినేష్ పరారీ అయ్యాడు. ఎట్టకేలకు ఇటీవలే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం చందన సూసైడ్ వీడియోలతో తెలియపరిచిర వివరాల ఆధారంగా దినేష్ను పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.