Begin typing your search above and press return to search.
'బాయ్‌కాట్ పుష్ప'.. ఏమైనా లాజిక్ వుందా?
By: Tupaki Desk | 16 Dec 2021 4:30 PM GMTఈ మధ్య కొంత మంది చేసే వివాదాలకు అస్సలు లాజిక్ వుండటం లేదు. మా వర్గం బాధపడుతున్నారు సినిమా ఆపేయాల్సిందే అంటాడొకడు... మా మానోభావాలు దెబ్బతిన్నాయ్ మాకు న్యాయం కావాలి.. లేదంటే సినిమా ఆపేస్తాం అంటాడొకడు... మాకు సినిమా నచ్చలేదు ఆపేయండి అని డిమాండ్ చేస్తుందొక వర్గం.. దేనికైనా లాజిక్ అనేది వుందా? .. బయటి సమస్యలకి సినిమాకి లింకేంటో అర్థం కాదు. కానీ అనవరంగా సినిమాకు ఆపాదిస్తూ అర్థం పర్థం లేని.. లాజిక్ లేని వివాదాలతో రచ్చ చేయడం ఈ మధ్య ప్రతీ ఒక్కరికీ ఫ్యాషన్ గా మారిపోయింది.
అదే ఇప్పుడు `పుష్ప` చిత్రానికి కర్ణాటకలో ఇబ్బందులు కలిగిస్తోంది. ఐకాన్ స్టార్ బన్నీ నటించిన `పుష్ప` రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో #BoycottPushpaInKannada అంటూ సోషల్ మీడియాలో కన్నడ ప్రేక్షకులు హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కన్నడ వెర్షన్ కి మించి తెలుగు వెర్షన్ కి కర్ణాటకలో అత్యధిక థియేటర్లు ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం కన్నడ ప్రజలని అవమానించడమే అవుతుందంటూ అక్కడి వారు ప్రచారం చేస్తున్నారు.
95 శాతం థియేటర్లు తెలుగు వెర్షన్ తో ఫుల్ అయిపోయాయి. టిక్కెట్స్ కూడా భారీ స్థాయిలో బుక్ అయ్యాయి. కన్నడ వెర్షన్ కి సంబంధించిన కొన్ని థియేటర్ లు ఫుల్ కావాల్సి వుంది. ఈ అంశాన్ని సెంటిమెంట్ కు లింక్ చేస్తూ వివాదం చేయడం.. ఓ సినిమాని టార్గెట్ చేయడం సిల్లీగా వుందని ఇండస్ట్రీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. తెలుగు వెర్షన్ థియేటర్లు రికార్డు స్థాయిలో ఫుల్స్ అయిపోయి టికెట్ లన్నీ అమ్ముడు పోయి కనిపిస్తుంటే కన్నడ వెర్షన్ మాత్రం ఇంకా గ్రీన్ అంటే ఇంకా ఫుల్ కాలేదని చూపిస్తున్నాయి. తెలుగు వెర్షన్ కు డిమాండ్ వుంది కాబట్టే ఫుల్స్ అయ్యాయని, ఏదైనా డిమాండ్ అండ్ సప్లైయ్ విధానాన్ని బట్టే వుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముందు కర్ణాటకలో డబ్బింగ్ వెర్షన్ కి పెద్దగా డిమాండ్ లేదు. అయినా చిత్ర బృందం డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిలీజ్ టైమ్ వరకు అంతా బాగానే వుంది. ఇప్పడే సినిమా తెలుగు వెర్షన్ కు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని, కన్నడ వెర్షన్ కు తక్కువ థియేటర్లు కేటాయించారని, ఇలాగైతే సినిమాని బాయ్‌కాట్ చేస్తామని కొంత మంది పనిగట్టుకుని సోషల్ మీడయా వేదికగా #BoycottPushpaInKannada అంటూ ప్రచారం చేయడంలో ఏమైనా లాజిక్ వుందా? అని బన్నీ అభిమానులు, ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మనో భావాల పేరుతో సినిమాను తొక్కేయాలనుకోవడం, టార్గెట్ చేయడం ఏమీ బాగాలేదని ఇండస్ట్రీ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.