Begin typing your search above and press return to search.
రియల్ భూత కోళ పండగలో కాంతార నటుడు
By: Tupaki Desk | 21 Jan 2023 10:30 AM GMT'కాంతార' చిత్రంతో రిషబ్ శెట్టి రేంజ్ అమాంతం పాన్ ఇండియాకు చేరిపోయిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ స్టార్ యష్ తర్వాత మళ్లీ కన్నడ రంగం నుంచి ఒక ప్రతిభావంతుడు ప్రపంచ సినీయవనికపై చర్చకు తెర తీసాడు. ఇప్పటికీ సెలబ్రిటీలు సామాన్య ప్రజలు 'కాంతార' సినిమాను చూసి అతడి నటనను ప్రశంసిస్తూనే ఉన్నారు.
'కాంతార' ఒక పంది ముఖం గల పంజుర్లి దైవం దైవత్వం నుండి ప్రేరణ పొందిన అద్భుత నేటివిటీ కథతో తెరకెక్కింది. ఇందులో కథానాయకుడి నట ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఎంపిక చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ కథాంశం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్ గా నిలవడానికి అతడి అద్భుత నటన ఒక ప్రధాన కారణమని అంగీకరించాలి.
అయితే ఇదంతా దైవం వల్లనే సాధ్యమని కథానాయకుడు రిషబ్ శెట్టి నమ్ముతున్నారు. దైవాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ భగవంతుని ఆశీర్వాదం కోసం చిత్ర కథానాయకుడు-నిర్మాత రిషబ్ శెట్టి అలాగే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్ కర్ణాటకలో ఒక మారు మూల ప్రాంతంలో జరిగిన భూత కోలా ఉత్సవంలో పాల్గొని అక్కడ తమ దైవానికి ప్రార్థనలు చేశారు.
ఇ ఇరువురూ స్వయంగా సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేయగా అది ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. హోంబలే ఫిల్మ్స్ అధినేతతో కలిసి కాంతార ఫేం రిషబ్ దైవా ఆశీర్వాదాలను కోరుతున్న వైనం అభిమానులను ఆకర్షిస్తోంది. ''మీరు ప్రకృతికి లొంగి ఉండండి. జీవితంలో ఇంతటి విజయాన్ని స్వేచ్ఛను మీకు ప్రసాదించిన దేవుడిని ఆరాధించండి.
#కాంతార బృందం నిజరూపంలో దైవాన్ని దర్శించి దైవానుగ్రహం పొందింది! 'కాంతార' ప్రపంచవ్యాప్తంగా 50 రోజులు 1000+ స్క్రీన్ లలో విజయవంతంగా ఆడింది'' అని హోంబలే సంస్థ సోషల్ మీడియాలలో వెల్లడించింది. మనలో ప్రతి ఒక్కరు సొంతం చేసుకున్న జీవించి ఉన్న దైవ వేడుకల్లో అరుదైన క్షణమిదని సదరు సంస్థ అధినేతలు ఆనందం వ్యక్తం చేసారు.
కాంతార కన్నడ - తెలుగులో ఏక కాలంలో విడుదల కాగా..హిందీలో అక్టోబర్ 14 న విడుదలైంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచయిత. ఆయనే దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించారు. అతడు మల్టీట్యాలెంటెడ్ అని నిరూపించాడు. విజయ్ కిరగందూర్ - చలువే గౌడ నిర్మించారు. ఈ చిత్రంలో శెట్టి - సప్తమి గౌడ- కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.